రామ‌సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-25 12:09:47

రామ‌సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి ప‌ద‌వి వ‌చ్చిన వెంట‌నే, తాను పార్టీని వీడి త‌న కార్యాచ‌ర‌ణ చెబుతా అన్నారు గ‌తంలో మాజీ మంత్రి జ‌మ్మ‌ల‌మ‌డుగు నాయ‌కుడు రామసుబ్బారెడ్డి.. చివ‌ర‌కు తెలుగుదేశంలో ఇద్ద‌రిని చంద్ర‌బాబు కూర్చోబెట్టి పంచాయ‌తీ చేశారు.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు.. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉన్నా, త‌ర్వాత ఇరువురు అనేక విషయాల్లో త‌మ‌కంటే త‌మ‌కు ప‌ద‌వులు అని పోట్లాట‌ల‌కు దిగారు.
 
ఇక గ‌త రెండు నెల‌లుగా జ‌మ్మ‌ల‌మ‌డుగులో అండ‌ర్ స్టాండింగ్ రాజ‌కీయం జ‌రుగుతోంది అని జ‌నాలే చ‌ర్చించుకుంటున్నారు.. వెనుక ఉన్న కేడ‌ర్ కొట్టుకుంటున్నారు కాని, రామ‌సుబ్బారెడ్డి, ఆదినారాయ‌ణ రెడ్డి ఇరువురు క‌లిసి కుమ్మ‌క్కై వ్యాపారాలు లాభాలు పంచుకుంటున్నారు అనే విమ‌ర్శ‌లు వినిపించాయి.. ఇక ఇటీవ‌ల ఓ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విష‌యంలో ఇరువురు కుమ్మక్క‌య్యార‌ని సీఎం ర‌మేష్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పావులు క‌దిపారు అనేది తెలిసిందే.
 
అయితే త‌న‌కు రామసుబ్బారెడ్డికి వివాదాలు రాకుండా సామ‌ర‌స్యంగా సీఎం చంద్ర‌బాబు ఇద్ద‌రు ఐఏఎస్ ల‌తో ఓ ఒప్పందం కుద‌రిర్చార‌ని.. ఇరువురు 50-50 తీసుకుంటున్నాము అని అన్నారు.. ఈ వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేసింది.. అయితే ఈ వివాదంలో రామ‌సుబ్బారెడ్డి పేరు మంత్రి ఆదినార‌య‌ణ రెడ్డి ప‌ల‌క‌డంతో ఆయన ఈ విష‌యం పై స్పందించారు. 
 
సీఎం చంద్ర‌బాబు మాకు ఎటువంటి పంచాయ‌తీ చేయ‌లేద‌ని రామ‌సుబ్బారెడ్డి అన్నారు. సోష‌ల్ మీడియాలో  వ‌స్తున్న వార్త‌లు నిజం కాదు అని అన్నారు...అయితే రామ‌సుబ్బారెడ్డి పేరును మంత్రి చెడ‌గొట్ట‌డానికి ఈ ఎత్తు వేశారా, లేదా మీడియాని ఇలా అన‌డంలో వాస్త‌వం ఏమిటి.. ఆ వార్త‌ల‌ను ఖండించాలి కాని ఇదంతా మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం పై ఆయ‌న ఫైర్ అయ్యారు.. అస‌లు ఆరోప‌ణ‌లు చేసింది అదే పార్టీలో కొన‌సాగుతున్న మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి, ఆ విష‌యం రామ‌సుబ్బారెడ్డి గుర్తించ‌డం లేదు.. ఇక్క‌డ మీడియాని త‌ప్పు అని ఎలా అంటారు.. ఏదో బ్రిటానియా 50-50 బిస్కెట్ ఫ్యాకెట్ లా మా పంప‌కాలు ఉంటున్నాయి అని బ‌హిరంగంగా మంత్రిచెబితే ఇందులో వాస్త‌వం లేదు అన‌డం ఏమిటి?
 
ఇది నిజంగా అక్క‌డ ప్ర‌జ‌లు కూడా విమ‌ర్శిస్తున్నారు.. అయితే ఇరువురు  కుమ్మ‌క్కై రాజ‌కీయం చేస్తున్నారు అని అంటున్నారు. ఇక జ‌మ్మ‌ల‌మ‌డుగులో వ‌చ్చే ఎన్నిక‌ల్లో  టికెట్ ఆదికి కూడా ఫిక్స్ చేసి రామ‌సుబ్బారెడ్డికి చంద్ర‌బాబు ఆఫ‌ర్ ప్ర‌క‌టించి ఉంటారు అని అంటున్నారు జిల్లా నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.