అడ్డంగా దొరికిపోయిన సీఎం రమేష్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-29 12:45:36

అడ్డంగా దొరికిపోయిన సీఎం రమేష్‌

ప్ర‌తిప‌క్ష వైయ‌స్ కాంగ్రెస్ పై నింద‌లు వేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం స‌ర్కార్‌. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌ని చేయాల్సిన ప్ర‌భుత్వం దాన్ని విస్మ‌రించి స్వప్ర‌యోజ‌నాల కోసం ప‌రిపాల‌న చేశారు. అంతేకాకుండా ప్ర‌జ‌ల కోసం చేసే ప్ర‌తీ ప‌నిలోను అవినీతికి పాల్ప‌డింది తెలుగుదేశం స‌ర్కార్.... దీన్ని అడుగ‌డుగునా ప్ర‌తిప‌క్ష వైయ‌స్ ఆర్  కాంగ్రెస్ పార్టీ ప్ర‌శ్నిస్తే అభివృద్దికి అడ్డుప‌డుతుందంటూ విమ‌ర్శ‌లు చేశారు టీడీపీ నాయ‌కులు.
 
ఏపీలో ప్ర‌స్తుతం ప్ర‌త్యేక‌హోదా అంశం కీల‌కంగా మారింది.ప్ర‌త్యేక‌హోదా కోసం మొద‌టి నుంచి పోరాటం చేసింది వైసీపీ. అయితే ఈ ఉద్య‌మం తీవ్ర రూపం దాల్చిడం వ‌ల్ల రాజ‌కీయ ల‌బ్దికోసం  ప్ర‌త్యేక‌హోదా నినాదాన్ని తీసుకుంది తెలుగుదేశం పార్టీ. గ‌త కొన్ని రోజులుగా పార్ల‌మెంట్‌లో సైతం ఏపీకి హోదా ప్ర‌క‌టించాలంటూ వైసీపీ పోరాటం చేస్తోంది.  
 
రాజ్యసభలో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానికి పాదాభివందనం చేశారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది తెలిసిందే. ఈ విషయంలో విజయసాయిరెడ్డిపై దుష్ప్రచారానికి దిగిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌.. సాక్ష్యాల విషయానికొచ్చేసరికి తెగ కంగారు పడ్డారు... ఏదో జరిగిందంటూ కట్టుకథ అల్లిన టీడీపీ ఎంపీల అసలు స్వరూపం బయటపడింది..
 
ఈ క్రమంలో కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారు. తొలుత సభలో ఏదో జరిగిందంటూ మీడియాతో మాట్లాడిన రమేశ్‌.. తర్వాత మాట్లాడేందుకు మరో ఎంపీ మురళీ మోహన్‌కు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఓ విలేకరి వైయ‌స్ఆర్ ఎంపీల వాదనను ప్రస్తావించగా.. సాక్ష్యాలిస్తే వాళ్లు రాజీనామా చేస్తారా అని సీఎం రమేశ్‌ ఆవేశంగా మాట్లాడారు.... అంతలో మురళీమోహన్‌ జోక్యం చేసుకుని ఫుటేజీ ఉంది కదా అని అన్నారు.అంత‌లోనే ఉంది  మీరు అది చెప్పొద్దు అంటూ సీఎం రమేశ్‌ మురళీమోహన్‌కు సూచించారు. దీంతో రమేశ్‌ చేసే ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉన్నదన్నది అర్థమైపోతోంది.
 
ఇటీవ‌ల‌ తనపై చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సీఎం రమేష్‌ను డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫుటేజ్‌ బయటపెట్టాలంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు విజయసాయిరెడ్డి లేఖ కూడా రాశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.