టీడీపీలో విభేదాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 14:49:40

టీడీపీలో విభేదాలు

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో  మ‌రోసారి వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి.. పార్టీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఇటీవ‌ల  తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకోవ‌డం మ‌నం చూశాం.. ఇక తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలుగుదేశం నాయ‌కుడు సీనియ‌ర్ నేత‌పై నిప్పులు చెరిగారు.. తన నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు అనుచరుల జోక్యం ఏంటని ప్రశ్నించారు.
 
దళిత ప్రజా ప్రతినిధుల నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయం మంచిది కాదని హితవు పలికారు.. ఇలాంటి ప‌ద్ద‌తి వ‌ల్ల ద‌ళితుల‌కు అభ‌ద్ర‌తాభావం పెరుగుతోంది అని తెలియ‌చేశారు. ద‌ళిత సెగ్మెంట్ల‌లో వారిని ప‌నులు చేయించ‌కుండా మీరు అడ్డుకోవ‌డం ఏమిటని, ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రి జోక్యం ఏమిటి అని ప్ర‌శ్నించారు. 
 
ఇక ఆర్టీసీ చైర్మ‌న్ వ‌ర్ల రామ‌య్య పై కూడా ఆయ‌న ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల మాదిగ విద్యార్ది పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ముందు వ‌ర్ల రామ‌య్య ఆ దుహంకారాన్ని త‌గ్గించుకోవాలి అని తెలియ‌చేశారు.వర్ల పట్ల మాదిగ జాతి ఆగ్రహంతో రగిలిపోతోందన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీశారు.
 
వర్ల రామ‌య్య‌ తక్షణమే మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగలంతా ఉద్యమానికి సిద్ధం కాకముందే వర్ల తన తప్పును దిద్దుకోవాలని సూచించారు రావెల కిషోర్ బాబు. ద‌ళితుల పై పెత్త‌నం చెలాయించే ప‌ద్ద‌తి ఇక‌నైనా పోవాలి అని ఆయ‌న తెలియ‌చేశారు. జిల్లాలో జ‌రుగుతున్న తీరుపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఫిర్యాదు చేస్తాన‌ని ఆయ‌న దృష్టికి ఈ విష‌యాలు తీసుకువెళ‌తాను అని అన్నారు.
 
ఆ నాడు ఎన్టీఆర్ ద‌ళితుల‌ను పార్టీ పెట్టిన స‌మ‌యంలో అక్కున చేర్చుకుంటే, ఇప్పుడు పార్టీలో ప‌రిస్దితి దీనికి భిన్నంగా ఉంది అని అన్నారు ఆయ‌న‌. జిల్లా అధికారుల తీరు కూడా ఏక‌ప‌క్షంగా ఉంటోంది అని అన్నారు ఆయ‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.