రావెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ravela kishor babu image
Updated:  2018-03-05 10:19:46

రావెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కొద్ది రోజులులగా అస‌మ్మ‌తి జ్వాల తెలుగుదేశం పార్టీలో ఎందుకో కాని విశేషంగా పెరిగిపోతోంది.. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర పుడుతున్న సమ‌యంలో ఈ నిర‌స‌న జ్వాల‌లు ఆవేశాలు ఆగ్రహాలు నాయ‌కత్వానికి కాస్త కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీలో ఉన్నా ఎప్పుడు మ‌న పార్టీ నుంచి అవ‌త‌ల పార్టీకి జంప్ అవుతారో అనే డైల‌మా ఆ నాయ‌కుడి పై తెలుగుదేశం లో ఉండేది.. ఆయ‌నే మాజీ మంత్రి ప్ర‌స్తుత ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు.
 
తాజాగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మ‌మైనింగ్  జోరుగా సాగుతోంద‌ని కోట్ల రూపాయ‌ల అవినీతిలో నా పేరు కూడా ఉంది అని ఇక్క‌డ ప్ర‌జ‌లు అనుకుంటున్నారు, ద‌య‌చేసి ఇక్క‌డ జరుగుతున్న ఈ అవినీతి ఆపాల‌ని మంత్రిని కోరారు, అయినా ఇక్క‌డ వారి ఆగ‌డాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది.
 
టీడీపీలో దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలోని దళిత ప్రజాప్రతినిధులకు పదవులు తప్ప అధికారం లేదని అన్నారు. ఆయన తాజాగా ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. పదవులు మావి.. పెత్తనం మాత్రం వాళ్లదా?’ అని నిలదీశారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. టీడీపీలో అన్ని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అగ్ర‌కులాల వారిదే పెత్త‌నం ఉంటోంది అని అన్నారు ఆయ‌న‌. ఉదాహ‌ర‌ణ‌కు కొడుమూరు ఎమ్మెల్యే మ‌ణిగాంధీని నామ మాత్ర‌పు ఎమ్మెల్యేగా చూస్తున్నారు..పెత్తనం మొత్తం అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్థన్‌రెడ్డి సాగిస్తున్నారు. ఇది ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని అన్నారు.
 
ఇక కొవ్వురు లో మంత్రి జ‌వ‌హ‌ర్ ప‌ద‌విలో ఉన్నారు అయినా అక్క‌డ మొత్తం పెత్త‌నం సుబ్బరాజు చౌదరి చేస్తుంటాడు అని అన్నారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అధికారం మొత్తం అక్కడి చైర్మన్‌ బాపిరాజు చేతుల్లో ఉంటోంది. మంత్రి నక్కా ఆనందబాబు పదవిలో ఉండగా, వేమూరు నియోజకవర్గంలో అధికారమంతా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా చేతుల్లోనే ఉంది. ప్రకాశం జిల్లా కొండెపిలో ఎమ్మెల్యే పదవి స్వామిది, అధికారం చెలాయించేది మాత్రం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జనార్దన్‌.
 
ఇక రావెల నా నియోజకవర్గం పరిధిలోని ఓబులునాయుడుపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తే ఆయనకు చెప్పా అయినా అక్క‌డ అక్ర‌మ మైనింగ్ త‌వ్వ‌కాలు ఆగ‌లేదు.. ఎవరికి చెప్పినా ఉపయోగం లేకుండాపోయింది.
 
ఇక్క‌డ మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే  నాకు వాటా పంపుతున్నామని ప్రచారం చేసి నా పేరుప్రతిష్టలను దిగజార్చడంతో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు విలేకరులను తీసుకుని అక్కడికి వెళ్లా. యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ జరగడం చూసి ఆశ్చర్యపోయా. నారాయణస్వామి, అశోక్‌ అనేవాళ్లు ఇష్టం వచ్చినట్లు అక్రమ మైనింగ్‌ చేస్తున్నట్లు తేలింది అని రావెల తెలియ‌చేశారు..మొత్తానికి రావెల అస‌హ‌నం చూస్తుంటే ద‌ళిత ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో ఎంతో అస‌హ‌నంతో కొన‌సాగుతున్నారు అని తెలుస్తోంది అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.