డైరెక్ట‌ర్ స‌వాల్... ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 12:53:30

డైరెక్ట‌ర్ స‌వాల్... ?

య‌జ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం, ఆటాడిస్తా, వీర‌భ‌ద్ర‌, సౌక్యం లాంటి హిట్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ఏయ‌స్ ర‌వికుమార్ చౌద‌రి... తెలుగు ఇండ‌స్ట్రీలో ఏయ‌స్ అంటే ప్ర‌తీ న‌టుల‌కు తెలుసు... కానీ, ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఆయ‌న పై అంత ఫోక‌స్ లేదు.... అయితే గ‌తంలో త‌నకంటూ ఒక ప్ర‌త్యేక‌ ఫేమ్ తెచ్చుకునే టైమ్ లో, ఆ క్రెడిట్ మొత్తం య‌జ్ఞం సినిమా ద్వారా హీరో గోపి చంద్ కొట్టేశాడు... దీంతో ఆయ‌నను  ఇండ‌స్ట్రీలో గుర్తించ‌డం  మిన‌హాయిస్తే, తెలుగు ప్రేక్ష‌కులు ర‌వికుమార్ చౌద‌రిని అంత గుర్తుప‌ట్ట‌లేరు.
 
అయితే  తాజాగా  ఈ నేప‌థ్యంలో ఓ యూట్యూబ్ వెబ్ సిరీస్ ఛాన‌ల్ ర‌వికుమార్ ను ఇంట‌ర్వ్యూ చేసింది... ఈ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న త‌న‌ రాజ‌కీయ ప్ర‌స్తావ‌న గురించి తెలియజేశారు... త‌న సొంత ప్రాంతం గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  ధూళిపాళ్ల న‌రేంద్ర కు వ్య‌తిరేకంగా పోటి చేస్తాన‌ని తెలిపారు ర‌వికుమార్ చౌద‌రి... న‌రేంద్ర ను ఏక‌దాటిగా టీడీపీ త‌రుపున ఐదు సార్లు గెలిపించినా, ఆ నగ‌రంలో ఒక్క చోట కూడా అభివృద్ది జ‌రుగ‌లేద‌ని అన్నారు.
 
అందుకే తాను ఈ నిర్ణ‌యం తీసుకోవల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ద‌ర్శ‌కుడు ఏయ‌స్ ర‌వికుమార్ చౌద‌రి తెలిపారు.. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ త‌రుపున పోటీ చేయ‌న‌ని, ఇండిపెండెంట్ గా ధూళిపాళ్ల న‌రేంద్ర పై పోటీ చేసి పోన్నూరు నియోజ‌క వ‌ర్గాన్ని అభివృద్ధి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ర‌వి...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.