రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌గ‌న్ బాబుల పై ఎయ‌స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and as ravi kuamr chowdary image
Updated:  2018-02-27 01:39:52

రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌గ‌న్ బాబుల పై ఎయ‌స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

య‌స్ ర‌వికుమార్ చౌద‌రి ఒక‌ప్పుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి త‌న కంటూ ఒక ప్ర‌త్యేక ఫేమ్ తెచ్చుకున్నారు... ఆ త‌ర్వాత త‌న వ్య‌క్తి గ‌త ప్రాబ్లమ్స్ వ‌ల్ల కొంత కాలం పాటు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు దూర‌మ‌య్యారు ర‌వి ... ఈప్రాబ్ల‌మ్స్ వ‌ల్ల నెమ్మ‌దిగా కోలుకున్న త‌ర్వాత 2014లో పిల్లా నువ్వులేని జీవితం టైటిల్ తో మ‌రో సినిమాను తెర‌కెక్కించారు ర‌వికుమార్ చౌద‌రి...  చాలా రోజుల త‌ర్వాత ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు.. ఈ చిత్రంలో సాయి ద‌ర‌మ్ తేజ్ హీరోగా రెజీనా కస్సాంద్ర స‌ర‌స‌న న‌టించారు.
 
అయితే  తాజాగా  ఏయ‌స్ ర‌వికుమార్ చౌద‌రితో ఓ ప్ర‌ముఖ వెబ్ సిరీస్ ఛాన‌ల్ ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేశారు... ఈ ఇంట‌ర్వ్యూలో రాజ‌కీయ నాయ‌కుల‌పై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ర‌వికుమార్ చౌద‌రి... ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కుల‌లో ప్ర‌తీ ఒక్క‌రు వారి సెగ్మెంట్ ల‌ల్లో ప్ర‌జ‌ల కోసం ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని అన్నారు ద‌ర్శ‌కుడు.. అలాగే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా నాయకుడ‌ని ప్ర‌జ‌ల‌కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డే నాయ‌కుడ‌ని అన్నారు.
 
దీంతో పాటు ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై స్పందించారు... జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని అన్నారు ర‌వి కుమార్ చౌద‌రి... అలాగే ఆయ‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఏ నాయ‌కుడు చేయ‌లేని అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న చేశార‌ని అన్నారు... కోట్లాది మంది ప్ర‌జ‌లు రాజ‌శేఖ‌ర్ రెడ్డిని అభిమానిస్తార‌ని, అలా అభిమానించే వారిలో తాను కూడా ఒక‌రిన‌ని తెలిపారు ఏయ‌స్ ర‌వి కుమార్ చౌద‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.