జ‌గ‌న్ కేసుల‌పై సుప్రీం కోర్టు అడ్వ‌కేట్ ర‌వి శంక‌ర్ కీల

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 05:35:27

జ‌గ‌న్ కేసుల‌పై సుప్రీం కోర్టు అడ్వ‌కేట్ ర‌వి శంక‌ర్ కీల

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సంబంధించిన కేసుల‌పై సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్ ర‌విశంక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో  ఆయ‌న వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క్యారెక్ట‌ర్ తో పాటు జ‌గ‌న్ కేసుల‌పై స్పందించారు. 
 
క‌ర్ణాట‌క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. కాని అక్క‌డ ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ మాత్రం ఒక్క‌రోజు కూడా రోడ్డెక్క‌లేద‌ని గుర్తు చేసిన ర‌విశంక‌ర్.. గ‌త నాలుగేళ్లుగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ..... ఇప్పుడు ప్ర‌జల‌కు అండ‌గా నిలిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తున్న వైకాపా అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌నస్పూర్తిగా అభినందించారు. 
 
జ‌గ‌న్ కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులు ఏ మ‌చ్చా లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. 11 కేసుల్లో 8 కేసులు ఎత్తివేసిన విష‌యాన్ని లాజిక్ గా ఆలోచించాల‌ని అన్నారు. కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌..... ఐఏఎస్  అధికారుల ద్వారా సంపాదించార‌ని ఉంది. ఇప్పుడు  అదే ఐఎస్ ఆఫీస‌ర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్న‌పుడు జ‌గ‌న్ పై వేసిన కేసులు ఎలా నిల‌బ‌డ‌తాయ‌ని ర‌విశంక‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు.
 
తండ్రిని చంపిన వారిని కూడా అక్క‌ర్లేదు వదిలేయ‌మ‌ని చెప్పిన మ‌న‌స్త‌త్వం.. గొప్ప‌త‌న‌మే రాజ‌శేఖర్ రెడ్డిని  అంత ఎత్తుకు ఎదిగేలా చేసింద‌ని ర‌విశంక‌ర్ అన్నారు. ఆయ‌న‌కు అన్ని ప‌రిస్దితులు తెలుసు కావున‌... ఏదైనా విష‌యంపై న‌లుగురితో మాట్లాడాకే జ‌డ్జిమెంట్ కు వ‌స్తార‌ని గుర్తు చేశారు.

షేర్ :

Comments

1 Comment

  1. Thank u sir.jagan kesulu lekunda ravalani korukuntunnanu

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.