చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన శ్రీకాంత్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 17:29:29

చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన శ్రీకాంత్ రెడ్డి

జగన్ కి వెన్నంటి ఉంటూ, టీడీపీపైన విమర్శలు చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడుతూ ఉంటారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఈ రోజు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నీరు - చెట్టు పేరుతో జరుగుతున్న అవినీతిపై స్పందించారు.
 
టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు కాబ్బటి,  ప్రభుత్వమే జీవోలు ఇచ్చి దోచుకోవాలని తెలుగు తమ్ముళ్ల‌ను ప్రోత్సహిస్తుంది. అంటే ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందో చూడండి అన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి..గతంలో కేవలం వాణిజ్య అవసరాలకు కాకుండా మిగిలిన అవసరాలకు మట్టి, ఇసుకను వాడుకోవచ్చని జీవో నెంబర్ 23లో ఉంది.
 
ప్రభుత్వం దారుణాతి దారుణమైన జీవో నెంబర్ 29 విడుదల చేశారు.వాణిజ్య అవసరాలకే కాదు దేనికైనా వాడుకోండి అని, ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిన అవసరసం లేదు, దోచుకోండి అని ఈ జీవోను విడుదల చేశారు..దోచుకోండి అని జీవోలు ఇస్తున్నముఖ్యమంత్రి మనకు అవసరమా..? ఇలాంటి ప్రభుత్వం అవసరమా? ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి, ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు...కానీ ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను దోచుకోమని ఆదేశాలు ఇస్తున్న ఈ ప్రభుత్వం మనకు అవసరమా..? అని ప్రభుత్వంపై మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి...
 
శ్రీ కృష్ణదేవరాయ‌లు హయాంలో త‌వ్విన చెరువులు వల్ల, రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్ లతో వ్యవసాయానికి ఒక భరోసా వచ్చింది.. కానీ ఇప్పుడు చెరువులలో ఉన్న మట్టిని తవ్వి చెరువులను నాశనం చేస్తున్నారు. పూర్వం కొంత మంది రాజులు గాలి పైనా, నీటిపైనా, జుట్టు పైనా పన్నులు వేశారు... నారా ఔరంగ‌జేబు అంటూ చంద్రబాబుకు కొత్త పేరు పెట్టారు శ్రీకాంత్ రెడ్డి..ఈ నారా ఔరంగ‌జేబు రాష్ట్రం మొత్తాన్ని దోచుకోండి, దోచుకోవడానికి తెలుగుదేశం నాయకులు మాత్రమే అర్హులు అని చెప్తున్నారు అని మండిపడ్డారు ఆయన.
 
2015 - 2016 లో 18 లక్ష కోట్ల క్యూబిక్ మీటర్లు. 2016 -2017లో 30 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్లు, 2017-2018 లో 24 లక్షల క్యూబిక్ మీటర్లు, 2018 - 2019 లో ఇప్పటివరకు 4 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక, మట్టిని దోచుకున్నారు.. ఈ నాలుగేళ్ళ కాలంలో సుమారు 80 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి, ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు ఆయన. ఒక క్యూబిక్ మీటరు 500 రూపాయలు వేసుకున్న సుమారు 30000 వేల కోట్ల రూపాయలు టీడీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.