వైసీపీలోకి మాజీ ఐజీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-16 15:36:44

వైసీపీలోకి మాజీ ఐజీ

ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుండి భారీ ఎత్తున మద్దతు రావడం, మరో వైపు టీడీపీ ఇచ్చిన హామీలను నాలుగేళ్లు గడిచిన నెరవేర్చకపోవడంతో వైసీపీలోకి వలసల జోరు ఊపందుకున్నాయి.జగన్ పాదయాత్ర టీడీపీ కంచుకోట అయిన కృష్ణా జిల్లాలోకి వచ్చినప్పటి నుండి వలసలు ఊపందుకోవడంతో, ఈ వలసలు టీడీపీ కంచుకోటలోనే జరగడంతో టీడీపీ నాయకులకు మిగుడుపడడం లేదు.  
 
గడిచిన రెండు నెలల కాలంలోనే చాల మంది సీనియర్ నేతలు వైసీపీలోకి వచ్చారు. టీడీపీ సీనియర్ నేత యలమంచిలి రవి, విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, కృష్ణా జిల్లాలో మంచి పట్టున్న‌ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వర్ రావు, ఆయన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లాలోనే వైసీపీలో జాయిన్ అయ్యి టీడీపీకి షాక్ ఇచ్చారు.
 
ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాయలసీమ నుంచి కూడా వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో నేత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనే రాయలసీమ మాజీ ఐజీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌. ఆయన పాదయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఈ వలసలను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.