సీమ‌లో జోన్ కోసం పోరాటం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 05:14:59

సీమ‌లో జోన్ కోసం పోరాటం

వెనుక‌బ‌డిన  రాయ‌ల‌సీమ‌లో గుంత‌క‌ల్లు కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు  రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు. అనంత‌పురం కేంద్రంగా ఆర్డీవో కార్యాల‌యం ఎదుట  48 గంట‌ల పాటు నిర‌వ‌ధిక నిర‌హార దీక్ష చేప‌ట్టింది రాయ‌ల‌సీమ యూనైటెడ్ ఫోర్స్‌.
 
రైల్వేజోన్ ఏర్పాటు చేయాల‌ని  ఇప్పటికే అనేక సార్లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా  కార్య‌క్ర‌మాలు చేశామ‌ని,   గ‌త యేడాది గుత్తి నుంచి గుంత‌క‌ల్లు వ‌ర‌కు పాద‌యాత్ర చేశామ‌ని సీమ ఉద్య‌మకారులు గుర్తు చేశారు. దీంతో పాటు  ల‌క్ష పోస్ట్‌కార్డుల‌ను ప్ర‌ధాని కార్యాల‌యానికి పంపామ‌ని,  ప్ర‌స్తుతం 48గంట‌ల పాటు నిర‌వ‌ధిక నిర‌హార దీక్ష చేప‌ట్టామ‌ని, వెనుక‌బ‌డిన‌ రాయ‌ల‌సీమ ప్రాంతానికి రైల్వేజోన్ ప్ర‌క‌టిస్తే అభివృద్ది చెంద‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని  వారు అన్నారు.
 
గుంత‌క‌ల్లు నుంచి దేశ న‌లుమూల‌ల‌కు ర‌వాణా సౌక‌ర్యం ఉంద‌ని, ప్ర‌తి సంవ‌త్స‌రం 11వంద‌ల కోట్ల  మేర ఆదాయం ఈ డివిజ‌న్ ద్వారా న‌ష్ట‌పోతున్నామ‌ని, కావున  గుంత‌క‌ల్లులో రైల్వేజోన్ ఏర్పాటు చేసి ఆదాయాన్ని పొంద‌డంతో పాటు అనేక ఉద్యోగాలు వ‌చ్చే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్యలు తీసుకోవాల‌ని సీమ మేధావులు  కోరుతున్నారు.
 
1937 శ్రీభాగ్ ఒప్పందం  మొద‌లుకుని ఇప్ప‌టి వ‌ర‌కు రాయ‌ల‌సీమ‌కు తీవ్రంగా అన్యాయం   చేస్తూనే ఉన్నారంటూ పాల‌కుల‌ను విమ‌ర్శించారు.  రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌టువంటి క‌డ‌ప ఉక్కు, అనంత‌పురంలో కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యం   ఇప్ప‌టి వ‌ర‌కు ఏర్పాటు చేయ‌లేద‌ని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎయిమ్స్‌ను అనంత‌పురంలో ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం దాన్ని మంగ‌ళ‌గిరికి త‌ర‌లించిందని,  అభివృద్దిని ఒకే చోట కేంద్రీకృతం చేసి మ‌రోసారి రాయ‌ల‌సీమ‌ను అన్యాయం చేయడాన్ని ఖండిస్తున్నార సీమ ఉద్యమకారులు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.