బాబు ఇప్పుడైనా ప‌ట్టించుకుంటావా...?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 06:15:59

బాబు ఇప్పుడైనా ప‌ట్టించుకుంటావా...?

అనంత‌పురం జిల్లాలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి చుక్కెదురైంది.  గురువారం నాడు కియా కార్ల పరిశ్రమ ఇన్‌స్టలేషన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. 
 
ప్ర‌సంగం మ‌ధ్య‌లో రాయ‌ల‌సీమ‌కు చెందిన విధ్యార్ధి సంఘం  నాయ‌కులు జై రాయ‌ల‌సీమ‌........హైకోర్టును రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయాల‌ని కోరుతూ న‌ల్ల జెండాల‌తో లేచి నిల‌బ‌డి నిస‌ర‌న తెలియ‌జేశారు. దీంతో,  త‌మ్ముళ్లు...... ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాదంటూ చంద్ర‌బాబు  స‌ద‌రు విద్యార్ధుల‌ను ఉద్దేశించి అన్నారు. 
 
దీంతో చంద్ర‌బాబు స‌భ‌లో నిర‌స‌న వ్య‌క్తం చేసిన సీమకృష్ణ,  న‌గేష్ ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. పోలీసులు తీరుపై రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా రాయ‌లసీమ‌లో హైకోర్టును ఏర్పాటు చేయాల‌ని కోరుతూ  సీమ‌లోని నాలుగు జిల్లాల్లో న్యాయ‌వాదులు, ప్ర‌జాసంఘాలు, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌తో ప్రభుత్వాన్ని డిమాండ్  చేస్తూనే ఉన్నారు. 
 
శ్రీభాగ్  ఒప్పందాన్ని తుంగ‌లో తొక్కేసిన ఏపీ స‌ర్కార్ రాజ‌ధానిని అమ‌రావ‌తికి త‌రలించింది, ఇప్పుడు హైకోర్టును కూడా అమ‌రావ‌తికే త‌ర‌లించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మైందంటూ వారు మండిప‌డుతున్నారు. మ‌రోవైపు సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు  సీమ ఉద్య‌మ‌కారుల‌ను, న్యాయ‌వాదుల‌ను  హౌస్ అరెస్టులు చేశారు.   మ‌రి సీమ యువ‌కుల‌ ఆవేద‌నతోనైనా బాబు హైకోర్టు అంశాన్ని ప‌ట్టించుకుంటారా...లేక సీమలో ఇలాగే వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటారా చూడాలి.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.