అమరావతి గురించి మాట్లాడితే జాతీయవాదమా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

rayalaseema and amaravthi image
Updated:  2018-03-04 03:38:16

అమరావతి గురించి మాట్లాడితే జాతీయవాదమా ?

BJP కర్నూలులో  రాయలసీమ డిక్లరేషన్ చేసిన రోజునుంచి BJP ని విమర్శించే  పేరుతో రాయలసీమ ఆకాంక్షలపై దాడిని అమరావతి నేతలు రోజురోజుకు పెంచుతున్నారు... BJP  ని రాజకీయంగా  విమర్శించినా రాష్ట్రానికి వారు చేయాల్సిన సాయంపై గట్టిగా నిలదీసినా అభ్యంతరం లేదు. కానీ ఆ మాటున సీమ సమస్యలు ప్రస్దావించిన ఒక్క కారణంతోనే అక్కసు వెళ్ల‌గక్కడం అందుకు రాష్ట్రంలోని దాదాపు అన్నిపార్టీలు వంతపాడటం మాత్రమే మాకు అభ్యంత‌రం.
 
చరత్రలోకి వెళ్లవలసిన అవసరం లేదు కానీ రాయలసీమ గురించి మాట్లాడిన వారు విభ‌జన వాదులా  ? అమరావతి వాదులు విభ‌జనవాదులా  ?  అన్న విషయంపై మాత్రం ఒక్క ఉదాహరణను ప్రస్దావించడం ఇక్కడ సముచితం అవుతుంది. నాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నపుడు తొలి ఆంధ్ర‌విశ్వవిద్యాలయం ఎక్కడ ఉండాలన్న విషయం చర్చకు వచ్చినపుడు అనంతలోనా, విజయవాడలోనా అన్న విషయంపై సభ‌లో ఓటింగ్ నిర్వహించారు. నాటి తమిళనాడు ప్రతినిధుల సాయంతో అనంతలోనే పెట్టాలని సభ తీర్మానించింది.
 
కానీ అందుకు భిన్నంగా దాన్ని విశాఖలో ఏర్పాటు చేసిన ఘనులు సర్కారు జిల్లా నేతలు. ఇక్కడ రాయలసీమను మోసం చేశారు అంటే విభ‌జనవాదం, అదే చట్ట సభ‌తీర్మానాన్ని పక్కన పెట్టి తమ ప్రాంతంలో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుకుంటే అది జాతీయవాదం అవుతుందా. అంత ఎందుకు 2014 సమైక్య ఉద్యమంలో మొత్తం ఉద్యమ ప్రతినిధులుగా ఢిల్లీలో కూర్చుని అమరావతికి నిధులు, పోలవరం జాతీయ ప్రాజెక్టు, విశాఖకు రైల్వేజోన్ , అన్నీ అయిన తర్వాత ప్రత్యేకహోదా లాంటివి చట్టంలో చేసుకుని రాయలసీమ అంశాలు అన్నీ పరిశీలన పేరుతో దగా చేయడం సమైక్యవాదామా  ? నాడు ఉమ్మడి రాష్ట్రంలో వై యస్ దూర దృష్టితో దుమ్మగూడెం టేల్ పాండు పధకాన్ని రూపొందించారు. 
 
అది జరిగితే నాగార్డున సాగర్ కు గోదావరి నీటిని తరలించి కృష్ణాడెల్టాకు, తెలంగాణకు శ్రీశైలం నీటిని పంపాల్సిన అవసరం లేకుండా ఆ నీటిని రాయలసీమకు అందించాలని పధకాన్ని రూపొందించి దాదాపు 500 పై చిలుకు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెడితే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయనీయకుండా (పోలవరానికి అడ్డు వస్తుందని) కుట్ర చేసినది ఎవరు  ? దీన్ని కూడా జాతీయవాదం అంటారా ? అమరావతి మేధావులు వారిని ఏకపక్షంగా బలపరుస్తున్న పార్టీలు సమాధానం చెప్పాలి. ఇలా ప్రతి సందర్బంలో దగా చేస్తూ అన్యాయం అని మాట్లాడితే అది విభ‌జన వాదం అన్న సెంట్ మెంట్ తో రాజకీయాలు చేస్తున్నారు.
 
BJP డిక్లేషన్ లో రాయలసీమకు కావాల్సింది ఏమిటి అన్న విషయాలను వారు పొందు పరిచినారు. వారు ప్రస్దావించిన విషయాలలో ముఖ్యమైనది. రెండవరాజధాని, హైకోర్టు, సీమకు ప్యాకేజీ, గుండ్రేవుల, రాయలసీమ అభివృద్దికి ప్రత్యేక బోర్డు. వాటిపట్ల మొదట అమరావతి వాదులు, వారిని బలపరుస్తున్న పార్టీలు తమ వైఖ‌రిని వెల్లడించి. రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు మద్దతు తెలిపి అందులో BJP చేయాల్సిన, చేయకుండా ఉన్న అంశాలను కచ్చితంగా విమర్శ చేయాలి. అంతేగానీ సీమప్రజల ఆకాంక్షలను BJP ప్రస్దావించడంతోనే వారిపై దాడి చేయడం ఏమిటి. రాజకీయంగా BJP తో విభేదించడం వేరు, రాయలసీమ అంశం వేరు. ( ఇపుడు మాట్లాడుతున్న వారికన్నా అనేక సందర్బాలలో BJP కీలక విధానాలపై మేమే విభేదించి మాట్లాడాము) కానీ వారి మీద ఉన్న కోపాన్ని సీమ సమస్యలు ప్రస్దావించినపుడు దాడి చేయడం అంగీకారం కాదు. 
 
అమరావతి ఏకపక్ష అభివృద్దిని వారు వ్యతిరేకించారు. ఇలానే కొనసాగితే రాష్ట్రం మరోమారు విభ‌జన జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించినారు. బహుశా అదే అమరావతి వాదులకు నచ్చి ఉండకపోవచ్చు. అంటే అమరావతి ఏకపక్ష అభివృద్ది వాదాన్ని ప్రశ్నించకూడదు. సీమకు అన్యాయం జరిగినా రాయలసీమ ప్రజలు మా పరిస్దితి ఏమిటి అని అడగకూడదు. అడిగితే విభ‌జన వాదులు అంటూ దాడి చేస్తారు.. అమరావతి మేధావులు వారికి మద్దతు ఇస్దారు రాజకీయ పార్టీలు. అంటే అమరావతి వాదం సమైక్యవాదం  ? రాయలసీమ గురించి మాట్లాడితే అది ఏర్పాటు వాదం . ?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.