డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 10:40:39

డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌...

తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రోజు రోజూకూ  పెరిగిపోతోంది. స‌హ‌జ‌మ‌ర‌ణాల‌ను మించి ఆత్మ‌హ‌త్య‌లు, హ‌త్య‌లు  జ‌రుగుతుండం దురుదృష్ణ‌క‌ర‌మైన విష‌యం. ఓ డ్రైవ‌ర్ సూడైడ్ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఏపీలో చోటు చేసుకుంది. 
 
ఆత్మ‌హ‌త్య చేసుకున్న డ్రైవ‌ర్ రాసిన సూసైడ్ నోట్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యులు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడి పేరు ప్ర‌స్తావించి ఉంది. రాయ‌పాటి కుమారుడు రంగారావు త‌న‌ను కులం పేరుతో దూషించార‌ని డ్రైవ‌ర్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
 
rayapati samba siva rao
రంగారావు కూతురి కారు డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్నపుడు రూ. 15 వేలు అడ్వాన్స్ గా తీసుకున్నా...అయితే  డ‌బ్బులు తీసుకున్న త‌ర్వాత నుండి  కులం పేరుతో  దూషిస్తున్నారు...అందుకే అవ‌మాన భారంతో ఉద్యోగం కూడా మానేశాన‌ని లేఖ‌లో రాసి ఉంది. త‌న ఆత్మ‌హత్య‌కు కార‌ణ‌మైన వారిని చ‌ట్టప‌రంగా శిక్షించాల‌ని లేఖ‌లో డ్రైవ‌ర్ కోరాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.