టీడీపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు జంపింగ్ సిద్దం అస‌లు కారంణం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 17:13:04

టీడీపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు జంపింగ్ సిద్దం అస‌లు కారంణం ఇదే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తురుణంలో షాక్ ల‌మీద షాక్ లు త‌గులుతూనే ఉన్నాయి. గతంలో టీడీపీకి రాయ‌ల‌సీమ మాత్ర‌మే వ్య‌తిరేకంగా ఉంద‌ని అనుకుంటే ఇప్పుడు కోస్తాలో కూడా వ్య‌తిరేక‌త పెరిగిపోతుంది. దీంతో టీడీపీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర‌ పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో విశాఖ‌లో కీల‌క రాజ‌కీయ నాయ‌కుడిగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే ప‌నిలో ఉన్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనుకూల మీడియా యాజ‌మాన్యం కీల‌క స‌ర్వే నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్వేలో గంటా నియోజ‌కవ‌ర్గం అయిన భీమిలీలో టీడీపీకి బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో మంత్రి గంటా అల‌క చెంది పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. 
 
కానీ అస‌లు విష‌యం అదికాద‌ని తెర‌వెనుక బ‌ల‌మైన కారంణం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కు అదేంటంటే 2019 ఎన్నిక‌ల్లో విశాఖలో గంటా శ్రీనివాస రావుతో పాటు త‌న కుమారుడిని కూడా రాజ‌కీయ అరంగేట్రం చేయించి ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. అయితే టీడీపీ త‌ర‌పున త‌న కొడుకుని పోటీ చేయించే ఆస్కారం లేదు. ఎందుకంటే అక్క‌డ అయ్యన్నపాత్రుడు అడ్డుత‌గ‌ల‌డం గ్యారంటీ. సో...అందుక‌నే గంటా శ్రీనివాస రావు పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
గంటా టీడీపీని వీడితే విశాఖ, నర్సీపట్నం ప్రాంతాల్లో అయ్యన్నపాత్రుడి వర్గానిది పైచేయిగా నిలుస్తుంది. కానీ టీడీపీని వీడిన గంటా, తిరిగి అదే ప్రాంతం నుంచి పోటీ చేస్తే మాత్రం అది కచ్చితంగా టీడీపీకి, అయ్యన్న పాత్రుడికి దెబ్బ.  చూడాలి మ‌రి ఎన్నిక‌ల స‌మ‌రానికి సుమారు ప‌ది మాసాలు గ‌డువు ఉంది ఈ లోపు విశాఖలో ఎలాంటి రాజ‌కీయ మార్పులు చోటుచేసుకుంటాయో అని రాష్ట్ర ప్ర‌జ‌లు క‌ళ్లార్ప‌కుండా చూస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.