న‌ల్గొండ‌లో తండ్రి కొడుకులు ఇలా చేయ‌డం వ‌ల్లే ప్ర‌మాదాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nandamuri family
Updated:  2018-08-29 04:48:49

న‌ల్గొండ‌లో తండ్రి కొడుకులు ఇలా చేయ‌డం వ‌ల్లే ప్ర‌మాదాలు

విధి లిక్కిత‌మో లేక కాకతాలియ‌మో న‌ల్గొండ జిల్లాలోనే దాదాపు నాలుగేళ్ల వ్య‌వ‌దిలో జ‌రిగిన రెండు భ‌యాన‌క రోడ్డు ప్ర‌మాధాలు తండ్రికొడుకుల‌ను బ‌లికొన్నాయి. దీంతో నంద‌మూరి ఇంట తీర‌ని విషాదాన్ని మిగిల్చాయి. విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ కు వ‌స్తున్న ఓ టాటా స‌ఫారి వాహ‌నం ఎదురుగా రాంగ్ రూట్ లో వ‌స్తున్న ట్రాక్ట‌ర్ ను భ‌లంగా డీ కొట్టింది. దీంతో వాహ‌నాన్ని న‌డిపిన వ్యక్తి ప్ర‌మాద దాటికి డ్రైవింగ్ సీటుకు స్టీరింగ్ మ‌ధ్య నలిగిపోయి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. 
 
దీంతో వెంట‌నే స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గానే ఆవ్య‌క్తి తుది శ్వాస విడిచారు. మృతి చెందిన వ్య‌క్తి నంద‌మూరి హ‌రికృష్ణ‌ కుమారుడు జాన‌కి రాముడు అని తేల‌డంతో నంద‌మూరి కుటుంబం విషాదంలో  మునిగిపోయింది. చెట్టంత కుమారుడి మృత‌దేహాన్ని చూసి హ‌రికృష్ణ‌ క‌న్నీరు మున్నీరు కావ‌డం అంద‌రిని క‌దిలించింది. ఇక విచిత్రం ఏంటంటే గ‌తంలో ఇదే జిల్లాలోనే హ‌రికృష్ణ మ‌రో కుమారుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ రోడ్డు ప్ర‌మాదానికి గురి అయ్యారు. అదృష్ట‌శాత్తు ప్రాణాపాయం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. 
 
2009 మ‌ర్చిలో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఖ‌మ్మం జిల్లాలో ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొని తిరిగి హైద‌రాబాద్ కు వ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న టాటా స‌ఫారి వాహ‌నం సూర్య‌పేట‌కు స‌మీపంలో మోతే క్రాస్ రోడ్డు వ‌ద్ద అదుపు త‌ప్పి చెట్టును డీ కోని కారు బోల్తాప‌డింది. దీంతో ఈ ప్ర‌మాంద‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. త‌ల‌కు నుదుటికి, మోచేతుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అత‌నితో పాటు త‌న‌ స్నేహితులు, న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌, క‌మిడియ‌న్ శ్రీనివాస్ రెడ్డి స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. 
 
ఇక ఇదే క్ర‌మంలో మ‌రో సారి మ‌రో విషాదం చోటు చేసుకుంది. ఇదే న‌ల్గొండలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ కూడా మృతి చెంద‌టం అంద‌రిని షాక్ కు గురి చేస్తుంది. నాడు కుమారుడు, ఇప్పుడు తండ్రి ఒకే విధంగా మ‌ర‌ణించ‌డంతో నంద‌మూరి కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, అత‌ని ఇద్ద‌రు కుమారులు ఒకే జిల్లాలో రోడ్డు ప్ర‌మాదానికి గురి కావ‌డం అర్థం కాని మిస్ట‌రీగా మారింది. పైగా స్వంగా ముగ్గురు త‌మ కార్ల‌ను న‌డుపుతున్న స‌మ‌యంలోనే ప్ర‌మాదాలు చోటు చేసుకోవ‌డం మ‌రో విచిత్రం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.