బాబుకి ముద్ర‌గ‌డ‌ బ‌హిరంగ లేఖ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 04:55:00

బాబుకి ముద్ర‌గ‌డ‌ బ‌హిరంగ లేఖ‌

కేంద్రం ప్ర‌క‌టించిన బ‌డ్జెట్ లో ఏ రాష్ట్రానికీ జ‌ర‌గ‌ని అన్యాయం ఏపీకి జ‌ర‌గ‌డంతో కేంద్రంపై ప్ర‌తిప‌క్ష, మిత్ర‌ప‌క్ష‌ నేత‌లు త‌మ‌ అసంతృప్తిని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు... విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కోన్న రైల్వే జోన్, ప్ర‌త్యేక హోదా వంటి అంశాల‌ను కేంద్రం ప్ర‌క‌టించ‌కపోవ‌డంతో ఎన్డీఏ స‌ర్కార్ ను వ్య‌తిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఈ క్ర‌మంలో మాజీ మంత్రి, కాపు ఉద్య‌మనేత‌, ముద్ర‌గ‌డ ప్ర‌త్యేక హోదాపై స్పందిస్తూ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు భ‌హిరంగ లేఖ రాశారు... కేవ‌లం మీ ప‌ర‌ప‌తిని కాపాడుకునేందుకే ఇలా చేస్తున్నార‌ని, టీడీపీ నాయ‌కులు కేంద్రాన్ని తిడితే ఎక్క‌డ మిత్రప‌క్షం కోల్పోతామ‌నే ఉద్దేశ్యంతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో కేంద్రాన్ని తిట్టిస్తున్నార‌ని ముద్ర‌గ‌డ అన్నారు... అలా చంద్ర‌బాబు ప‌వ‌న్ తో కేంద్రాన్ని తిట్టించి జాతీయ పార్టీకి దూరం చేస్తున్నార‌ని ముద్ర‌గ‌డ లేఖ‌లో పేర్కోన్నారు.
 
ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ కానీ, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కానీ, తాను కానీ ఎన్ని సార్లు కేంద్రాన్ని వ్య‌తిరేకిస్తూ మొర‌పెట్టినా ఫ‌లితం ద‌క్క‌ద‌న్నారు... ఎప్పుడైతే చంద్ర బాబు ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేస్తారో అప్పుడే మ‌నకు విభ‌జ‌న చ‌ట్టాలలో ఉన్న‌ హామీలు అమ‌లు అవుతాయని ముద్ర‌గడ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.