ఈ కార‌ణంతోనే మోడీని నాలుగు సార్లు క‌లిశా విజ‌య‌సాయి రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy meets narendra modi
Updated:  2018-03-19 03:54:35

ఈ కార‌ణంతోనే మోడీని నాలుగు సార్లు క‌లిశా విజ‌య‌సాయి రెడ్డి

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఈ రోజు ఢీల్లీలో మీడియాతో మాట్లాడారు... తాము ప్ర‌త్యేక‌ హోదా కోసం ఎందాకైనా పోరాడుతామని ఇందులో ఎటువంటి సందేహం లేద‌ని అన్నారు... ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు... అయితే హోదా కోసం వైసీపీ నేత‌లు చేస్తున్న అలుపెరుగ‌ని పోరాటాన్ని చూసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌హించ‌లేక‌పోతున్నార‌ని అన్నారు..
 
అందులో భాగంగానే తాను ఇదే విష‌యంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో మూడు, నాలుగు సార్లు స‌మావేశం అయ్యాన‌ని విజ‌య‌సాయి రెడ్డి వెళ్లడించారు.. తాను కేవ‌లం రాష్ట్ర ప్రయోజ‌నాల‌కోస‌మే మోడీని క‌లిశాన‌ని అన్నారు.. అయితే ఇదే విష‌యాన్ని తెలుగు దేశం పార్టీ నాయ‌కులు ఆస‌రాగా చేసుకుని త‌మ‌పై లేనిపోని ప్ర‌చారం చేస్తున్నార‌ని మీడియా ద్వారా మండిప‌డ్డారు విజ‌య‌సాయి రెడ్డి.
 
విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను అలాగే అధికారం అండ‌తో ప‌న్ను రూపంలో చెల్లిస్తున్న సొమ్మును బాబు స‌ర్కార్ ఎలా దుర్వినియోగం చేస్తుందో ప్ర‌తీ అంశాన్ని మోడీకి వివ‌రించాన‌ని అన్నారు... అలాగే కేంద్ర నిధులు ఎలా దారి మ‌ళ్లించి చంద్ర‌బాబు త‌న అవినీతి సొమ్మును హ‌వాల రూపంలో విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌నే విష‌యాన్ని తాను అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకువ‌చ్చాన‌ని విజ‌య‌సాయి రెడ్డి తెలిపారు...
 
అయితే ఇదంతా తాను కేసులు మాఫీ చేయించుకునేందుకు తాను ప్రధానిని క‌లిశాన‌ని తెలుగు దేశం నాయుకులు చేస్తున్న ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని అన్నారు.. అందులో భాగంగానే త‌న‌పై ఉన్న కేసులు ప్ర‌భుత్వ ప‌రిధిలో లేవ‌ని అవి కేవ‌లం కోర్టు ప‌రిధిలో ఉన్నాయ‌ని అన్ని కేసుల విచారణ ముగిసిందని తెలిపారు...కాగా టీడీపీ నాయకులు ప్ర‌చారం చేసేముందు కాస్త ఆలోచించి ప్ర‌చారం చేస్తే మంచిద‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య‌సాయిరెడ్డి..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.