ప‌వ‌న్ చంద్ర‌బాబును ఎందుకు టార్గ‌ట్ చేశారంటే....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan and chandrababu naidu image
Updated:  2018-03-15 01:11:31

ప‌వ‌న్ చంద్ర‌బాబును ఎందుకు టార్గ‌ట్ చేశారంటే....

జనసేనాని పవన్ రాకీయంగా కీలక మార్పు వైపు పయనిస్తున్నారా ? గుంటూరు వేదికగా పవన్ అధికార TDP ప్రభుత్వం పై చేసిన విమర్శ‌లు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటి వరకు తాను 2014 సార్వత్రిక ఎన్నికలలో బాబుగారికి మద్దతు ఎందుకు ఇచ్చాను, జగన్ కు ఇవ్వలేదు ఎందుకంటే లాంటి ప్రకటనలు చేస్తూ వచ్చినారు. ఒక్కసారిగా పార్టీ వార్షికోత్సవంలో అధికార పార్టీపై ఆరోపణలు చేయడం చూస్తుంటే పవన్ తన పంధాను మార్చుకున్నట్లు అర్దం అవుతుంది. దాని కారణం పవన్ మారినట్లేనా లేదా ఇంకేమైనా ఉందా.......
 
2014 సార్వత్రిక ఎన్నికలలో పవన్ TDP, BJP ల కూటమికి మద్దతు ఇచ్చారు. వారు మద్దతు ప్రకటించిన పార్టీలే  కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. కొంత కాలం మౌనంగా ఉన్న పవన్ మెల్లగా కేంద్రం పై విమర్శ‌లు చేస్తూ రాష్ట్రంపై పెద్దగా విమర్శ‌లు చేయలేదు. అంతేకాక ప్రతిపక్షనేత పై అసందర్బంగా విమర్శ‌లు చేసినారు. పలితం పవన్ ను బాబు నడిపిస్తున్నారు అన్న విమర్సలను ఎదుర్కొవాల్సి వచ్చింది.
 
కొన్ని ప్రజాసమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ల‌డం వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటూ ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలని జగన్ ను అధికారపార్టీ వెటకారంగా మాట్లాడటం వలన  పవన్, బాబుగారి చేతిలో ఉన్నారన్న విమర్శ‌లు ఎదుర్కోవాల్సివచ్చింది. అంతేకాక పార్లమెంట్ సభ్యులు సరిగాలేరని మాట్లాడిన పవన్ రాజకీయంగా TDP, BJP లు అధికారిక  నిర్ణయం తీసుకోకుండా అందులోని సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించడం సాధ్యంకాదు అన్న సంగతి మరిచారు. మోదీ, చంద్రబాబులను విమర్శించకుండా వారి వెనక ఉన్న నేతలను విమర్శించడం వలన  ప్రజల మద్దతు కూడగట్టలేక పోయారు.
 
పవన్ ఒక్కసారిగా అధికార TDP పై తీవ్ర విమర్శ‌లు చేయడం మరీ ముఖ్యంగా బాబు వారి రాజకీయ వారసుడు లోకేష్ లను లక్ష్యంగా చేసుకోవడం పెద్దమార్పే. దీనికి కారణం అధికారపార్టీని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తే ప్రజలు సమర్దించరన్న వాస్తవాన్ని పవన్ ఆలశ్యంగా గుర్తించినట్లు ఉన్నారు. అంతే కాదు ఏపీలో 2014 నాటి పరిస్దితులు అంటే కేంద్రంపై రాజకీయ యుద్దం ప్రకటించి సెంటిమెంట్ రాజకీయం చేస్తే కూడా ప్రజలు అంగీకరించక పోవచ్చన్న అబిప్రాయానికి వచ్చినట్లు ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేయాల్సింది ఎంత ఉందో రాష్ట్రం చేయాల్సింది అంతకన్నా ఎక్కువే ఉంటుంది.
 
ప్రజలు కేంద్రంపై కోపంగా ఉన్నారన్నది నిజం కానీ అదే సందర్బంలో బాబుగారి పరిపాలన విషయంలో కూడా అంత సానుకూలంగా లేరన్న విషయం పవన్  గుర్తించనట్లు తెలుస్తుంది. ఎందుకంటే బాబు పాలన పై వారు చేసిన ప్రధాన విమర్శ‌ అవినీతి, అక్రమ సంపాదన ఆ విమర్సలు ప్రారంభం నుంచే ఉన్నాయి. మరి ఇన్నిరోజులు మాట్లాడలేదు అంటే ఇప్పుడు అర్దం అయితే మాట్లాడింది మాత్రం కాదు కేవలం ప్రజలు ఆలోచనలను పవన్  గుర్తించారు అంతే. బాబు గారి పాలనను గురించి మాట్లాడకుండా కేవలం కేంద్రంనో, ప్రతిపక్షనేతనో విమర్శించితే ప్రజలు అంగీకరించరన్న వాస్దవం అన్న విషయాన్ని పవన్ గుర్తించడమే ఇక్కడ కీలకం.
 
మరో ముఖ్య‌మైన మార్పు పవన్ ప్రజల ముందుకు వచ్చి పోరాటం చేయడం లేదు అన్న భావన ఉంది. దానికి పవన్ ఇంత కాలం చెప్పిన కారణం తాను ప్రజలముందుకు వస్తే శాంతి బద్రతల సమస్య‌ వస్తుంది అని. కానీ ప్రజలు దానిని అంగీకరించరు పవన్ కన్నా అనేక రెట్లు ప్రజాదరణ‌ కలిగిన రామారావుగారు ప్రజల‌ముందుకు రాలేదా పవన్ రాకపోవడానికి వారు చెప్పిన కారణం కన్నా ఏదో రాజకీయ కారణం ఉంది అన్నట్లు ప్రజలు భావించారు. నేడు పవన్ ఒక్కసారిగా తన పందాను మార్చుకుని ఏకంగా నిరవదిక దీక్ష చేస్తామనడం కూడా ప్రజలలో ఉన్న ఆలోచనను పవన్ గుర్తించడమే.
 
రాజకీయంగా కీలక విషయాలు మాట్లాడిన పవన్ ఇంకా కొన్ని విషయాలలో గందరగోళం కొనసాగుతుంది. తనకు అధికారం మీద మోజు లేదని మాట్లాడటం విచిత్రంగా ఉంది. ఎవరైనా పార్టీని పెట్టేది ఇపుడు ఉన్న పార్టీలు సరిగా లేవని వారి స్దానంలో తాను ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయదలుచుకున్నాని ప్రకటించి ప్రజల మద్దతు కోరుతారు. ఈ విషయంలో పవన్ ఇంకా గందరగోళంలో ఉన్నట్లు అర్దం అవుతుంది. నాలుగు సంవత్సరాల క్రింద పార్టీని స్దాపించి ఇప్పటి వరకు కనీసం పార్టీ రాష్ట్రకమిటీని కూడా ఎంపిక చేసుకోకుండా తానే అన్నీ అయినట్లూ, ఒకరే నిర్ణయాలను తీసుకుంటూ పార్టీలో రెండవ పేరు నేటికీ లేకుండా రాజకీయాలు చేస్తున్న పవన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజలు హర్షించరు.
 
TDP, YSRCP, BJP లకు తాను రాజకీయ ప్రత్యామ్నాయం గా ముందుకు వస్దే ప్రజలు ఆలోచిస్తారు గానీ అలాంటి ఆలోచనను, అందుకు తగిన విధానాలు, కార్యచరణ ప్రకటించకుండా రాజకీయాలు చేస్తే ప్రజల ఆదరణ పొందటం సాద్యం కాదు. ఏది ఏమైనప్పటికి పవన్ రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేశారు. మరిన్ని అడుగులు వేస్తేగానీ పవన్ పయనం గమ్యం చేరుతుందా..? దారి తప్పుతుందా..? అన్న విషయం తేలిపోతుంది.

షేర్ :

Comments

2 Comment

  1. Pavan distanced himself from BJP & TDP, as both are sinking boats in AP. He is going to join hands with YSRCP & left parties, which will be supported by Reddys, Kapus, BCs, SCs, & STs, & Minorities. YSRCP is going to form the government in 2019, supported by Janasena & left parties. Both TDP & BJP w

    Pavan distanced himself from BJP & TDP, as both are sinking boats in AP. He is going to join hands with YSRCP & left parties, which will be supported by Reddys, Kapus, BCs, SCs, & STs, & Minorities. YSRCP is going to form the government in 2019, supported by Janasena & left parties. Both TDP & BJP w

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.