నంద‌మూరి హీరో నందమూరి హరికృష్ణ క‌న్నుమాత‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-29 12:16:47

నంద‌మూరి హీరో నందమూరి హరికృష్ణ క‌న్నుమాత‌

మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడు హీరో, మాజీ ఎమ్మెల్యే నందమూరి హరికృష్ణ ఈ రోజు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద  ఈ రోడ్డు ప్రమాదం జరిగిం‍ది.  కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు. 
 
గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.