సైకిల్ పార్టీ అశ్లీల‌ నృత్యాల కార్య‌క్ర‌మం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp leaders east godavari district
Updated:  2018-03-27 18:49:51

సైకిల్ పార్టీ అశ్లీల‌ నృత్యాల కార్య‌క్ర‌మం

ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఏ ఘ‌న కార్యం చేసినా  ఆర్చ్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు... ఎందుకంటే 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో అనేక హామీలు ప్ర‌క‌టించి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ, ఇంత‌వ‌ర‌కూ  ప్ర‌చారంలో పేర్కొన్న‌ ఏ ఒక్క హామీను కూడా నెర‌వేర్చ‌లేక పోయింది... ప్ర‌జ‌ల చేత ప్ర‌జ‌ల కొర‌కు ఎన్నుకోబ‌డిన ప్ర‌జాస్వామ్య నాయ‌కులు ప్ర‌జ‌ల కోసం ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం కూడా చేయ‌లేదు.. అధికార బ‌లంలో విచ్చ‌ల‌విడిగా ఇష్టాను సారం అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ ఇష్టా రాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు టీడీపీ నాయ‌కులు.
 
అయితే మొన్న‌టికి మొన్న విశాఖ భూ కుంభ‌కోణం, నిన్నేమో ఇసుక మాఫియా నేడేమో రాజ‌ధాని భూములు ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తీ రోజూ టీడీపీ నాయ‌కులు రాష్ట్రంలో ఏదో ఒక చోట అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూనే ఉన్నార‌ని అనేక చోట్ల ప్ర‌జ‌లు వాపోతున్నారు... ఈ క్ర‌మంలో కొన్ని చోట్ల టీడీపీ నాయ‌కుల‌పై కేసులు పెట్టినా కానీ వారి వ్య‌వ‌హారం త‌గ్గ‌లేద‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు.
 
ఇక తాజాగా భ‌క్తి ముసుగులో ప‌విత్ర‌మైన శ్రీరామ‌న‌వ‌మి పండుగ నాడు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు తూర్పు గోదావ‌రి జిల్లా తొండంగి మండ‌లం రావికంపాడు గ్రామంలో అసాంఘీక కార్యాకలాపాలను ప్రోత్సహించారు... ఓమంత్రి  ఇలాకాలో అశ్లీల నృత్యాలను నిర్వహించారు అనే వార్త‌లు వ‌స్తున్నాయి.. దీనిపై అక్క‌డ స్ధానిక మ‌హిళ‌లు మండిప‌డుతున్నారు... అధికార పార్టీ నాయ‌కులు ఇటువంటి ప‌ని చేయించ‌డం ఏమిట‌ని మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.