టీడీపీలో కొన‌సాగుతున్న రాజీనామాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-10 13:46:23

టీడీపీలో కొన‌సాగుతున్న రాజీనామాలు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పార్టీకి చెందిన నాయ‌కులు ఊహించ‌ని షాక్ లు ఇస్తున్నారు. అనేక సంద‌ర్బాల్లో చంద్ర‌బాబు ఎవ్రీ థింగ్ ఈస్ అండ‌ర్ మై కంట్రోల్, నా అనుమ‌తి లేనిదే చీమ అయినా కుట్టుదు అని ప్ర‌చారంచేసుకునే ఆయ‌న‌ ఇప్పుడు పార్టీ నాయ‌కులే కంట్రోల్ త‌ప్పుతున్నారు. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి టీడీపీకి చెందిన నాయ‌కులు ఇద్ద‌రు ఉండ‌టంతో వారిలో ఎవ‌రికి సీటు క‌న్ఫామ్ చేయాలో అర్థంకాక చంద్ర‌బాబు నాయుడు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో కొంత మంది టీడీపీ నాయ‌కులు మెల్ల‌గా ఇత‌ర పార్టీల్లో కి జంప్ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. 
 
గ‌డిచిన ఎన్నిక‌లు ఒక ఎత్తు అయితే జ‌రుగబోయే ఎన్నిక‌లు మ‌రో ఎత్తు, ఎందుకంటే ఈ ఎన్నిక‌ల్లో మొద‌టి ప్ర‌పంచ యుద్దం ఏ విధంగా జ‌రిగిందో రాబోయే ఎన్నిక‌లు కూడా  అదే స్థాయిలో జ‌రుగ‌నున్నాయి. ఇక ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన వ్య‌క్తి ని జీవితాంతం ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకుంటారు. అందుకే అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌మ‌కంటే త‌మ‌కు సీటు క‌న్పామ్ చెయ్యాల‌ని చంద్ర‌బాబు పై ఒత్తిడి తీసుకు వ‌స్తున్నారు.
 
ఇక ఆ ప‌ర్యాయం ముగియ‌క ముందే టీడీపీలో మ‌రో గొడ‌వ ర‌చ్చ‌బండ‌కు ఎక్కింది.ఏఎంసీ చైర్మన్‌ పదవికేటాయింపుల‌ను వ్య‌తిరేకిస్తూ నూజివీడులో తెలుగు దేశంపార్టీ నాయ‌కులు ఒకరి త‌ర్వాత ఒక‌రు రాజ