టీడీపీ - వైసీపీ కుబేరులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-22 17:28:01

టీడీపీ - వైసీపీ కుబేరులు

కుబేరులు అన‌గానే వెంక‌న్న గుర్తువ‌స్తారు... అయితే రాజ‌కీయాల్లో కూడా ప‌దవులు అధిరోహించాలి అంటే ఆ కుబేరులే కావాలి.. అవును పార్టీతో ప‌నిలేదు బిజినెస్ తో ప‌నిలేదు.. జ‌స్ట్ పార్ల‌మెంట్ కు వెళ్లాలి అనే కోరిక ఉంటే ఏ వ్యాపార‌వేత్త అయినా అదే జోరుమీద వెళుతున్నారు గ‌త రెండు ద‌శాబ్దాలుగా, ఈ ప‌రంప‌ర మ‌రింత పెరిగింది అని చెప్పాలి ఇటీవ‌ల రాజ‌కీయాల్లో.
 
ఇప్పుడు ఈ కుబేరుల అంశం విష‌యం తెర‌మీద‌కు రావ‌డానికి కార‌ణం కూడా ఉంది... తెలుగుదేశం అంటేనే పారిశ్రామిక వేత్త‌ల పార్టీ అంటారు.. ఇక బాబు అధికారంలో ఉంటే ఎమ్మెల్సీ - రాజ్య‌స‌భ సీట్లు కేవ‌లం పారిశ్రామిక  వేత్త‌ల‌కు మాత్ర‌మే ఇస్తారు అంటారు. ఇక్క‌డ రాజ‌కీయంగా ఆలోచిస్తే తెలుగుదేశంలో ఇప్పుడు ఉన్నా ఎంపీలు కూడా బిజినెస్ ప‌ర్సెన్స్ అనేది తెలిసిందే.
 
ఇక తాజాగా రాజ్య‌స‌భ‌కు ఏపీ నుంచి నామినేట్ అయిన ముగ్గురు ఎంపీల గురించి క్లుప్తంగా తెలుసుకుంటే, వారు కుబేరులు అని చెప్పాలి.....రమేష్ కు రూ. 40 కోట్ల విలువైన చరాస్తులుండగా రూ. 218 కోట్ల స్దిరాస్తులు ఉన్నాయి.. ఇక వైసీపీ త‌ర‌పున ఎన్నికైన నాయ‌కుడు వేమిరెడ్డికి రూ. 59 కోట్ల చరాస్తులుండగా రూ. 170 కోట్లు స్ధిరాస్తులు ఉన్నాయి.
 
వీరు ఇద్ద‌రు కుబేరుల‌ను దాటి అప‌ర కుబేరులు అనిపించుకున్నారు..టీడీపీ నుంచి గ‌తంలో ఎన్నికైన సిఎం రమేష్ మ‌రోసారి త‌న సీటును ప‌దిలం చేసుకున్నారు.. ఇక తెలుగుదేశం త‌ర‌పున, కనకమేడల రవీంద్రకుమార్ కు అవ‌కాశం ఇచ్చారు చంద్ర‌బాబు.. ఇక జ‌గ‌న్ ప్ర‌క‌టించి - తెలియ‌చేసిన‌ట్లే వేమిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. 
 
ఇక రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో వీరు దాఖ‌లు చేసిన నామినేష‌న్ల వివ‌రాల ప్ర‌కారం.. ఇద్దరికీ  భారీగా ఆస్తులున్నాయి... సిఎం రమేష్ ఆస్తుల విలువ రూ. 258 కోట్లు. వేమిరెడ్డి ఆస్తుల విలువ రూ. 230 కోట్లు. ఇక ఇన్ని ఆస్తులు ఉన్న‌వీరికి అప్పులు ఎన్ని ఉన్నాయి అంటే.. వేమిరెడ్డికి రూ. 96 కోట్ల అప్పులుండగా, రమేష్ కు రూ. 39 కోట్ల అప్పులున్నాయి. ఇది రాజ‌కీయ కుబేరుల చిట్టా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.