ఏపీలో ఆర్ ఎంపీలు బంద్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 02:59:59

ఏపీలో ఆర్ ఎంపీలు బంద్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌లు ప్రాంతాల్లో ఆర్ ఎంపీలు, పీఎంపీలు వైద్య సేవ‌లు బంద్ చేశారు. దీంతో గ్రామీణ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వైద్య సేవ‌లు అందిస్తున్నారంటూ ఆర్ ఎమ్ పీ, పీఎంపీల‌పై అధికారులు దాడులు నిర్వ‌హించి వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
ap rmp doctors 
 
తెలుగు రాష్ట్రాల్లో గ‌త కొంత కాలంగా అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వ‌హించి ఆర్ ఎంపీ, పీఎంపీల‌తో పాటు ప‌లు మెడిక‌ల్ షాపుల‌ను సీజ్ చేస్తున్నారు. దీంతో త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు ఈ గ్రామీణ వైద్యులు. జీవో నంబ‌ర్ 465ను  వెంట‌నే అమ‌లు ప‌ర‌చి పారామెడిక్స్ గా త‌మ‌ను ప్ర‌భుత్వం గుర్తించి శిక్ష‌ణ ఇవ్వాల‌ని వారు ఎప్ప‌టినుండో డిమాండ్ చేస్తున్నారు.
ap doctors 
మేము చేయాల్సిన సేవ‌ల‌ను జీవోలో తెలియ‌జేసి వాటిని శిక్ష‌ణ ద్వారా తెలియజేయాల‌ని వారు  ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల‌లో వైద్య‌సేవ‌లు అందిస్తున్న ఆర్ ఎమ్ పీ, పీఎంపీల సేవ‌ల‌ను గుర్తించాల‌ని కోరుచున్నారు.
rmp protest 
 
ఆర్ ఎంపీలు, పీఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో సేవ‌లు నిలివేయ‌డం వ‌ల‌న అక్క‌డ  ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.అందువ‌ల‌న వారు కోరుతతున్న‌ట్లుగా అర్హులైన వారికి గుర్తింపు ఇచ్చి సేవ‌లు అందించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు.
protest ap rmps 
లేని ప‌క్షంలో ప్ర‌భుత్వ‌మే గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌భుత్వం వైద్య‌సేవ‌లు అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈ ప‌ని ఎలాగూ ప్ర‌భుత్వం చేయ‌లేద‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలుసు..... కావున అధికారులు దాడులు ఆపేసి ముందు ఆర్ ఎంపీల‌కు, పీఎంపీల‌కు శిక్ష‌ణ ఇచ్చి గుర్తింపు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.