చంద్ర‌బాబు అక్క‌డే సెటిల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 15:12:40

చంద్ర‌బాబు అక్క‌డే సెటిల్

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా మ‌రోసారి  ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... నాలుగు సంవ‌త్స‌రాలు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు రాష్ట్రంలో ఒక్క‌చోట అయినా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారా అని ప్ర‌శ్నించారు... వైసీపీ ఎంపీలు ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా పోరాడుతుంటే చంద్ర‌బాబు మాత్రం త‌న ఎంపీల‌తో అఖిలప‌క్ష స‌మావేశం అంటూ అమ‌రావ‌తిలో భ‌జ‌న చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.
 
పార్ల‌మెంట్ స‌మావేశాలు చివ‌రి రోజున వైసీపీ ఎంపీల‌తో పాటు చంద్ర‌బాబు టీడీపీ ఎంపీల‌తో రాజీనామా చేయించి ఉంటే రాష్ట్రానికి ఇంత గ‌తి ప‌ట్టేది కాద‌ని అన్నారు... త‌న స్వార్థ రాజ‌కీయాల‌కోసం అమాయ‌క ప్ర‌జ‌ల‌ను, రాష్టాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు రోజా... ఎప్పుడైతే చంద్ర‌బాబు త‌న ఎంపీల‌తో రాజీనామా చేయిస్తారో అప్పుడే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని రోజా తెలిపారు.
 
రాష్ట్రంలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం విస్రృత స్థాయిలో జ‌రుగుతుంటే చంద్ర‌బాబు మాత్రం పెట్టుబ‌డులు పేరుతో సింగ‌పూర్ కు వెళ్తున్నార‌ని మండిప‌డ్డారు... గంతంలో కూడా అనేక సార్లు సింగ‌పూర్ కు వెళ్లార‌ని అయితే రాష్ట్రానికి ఏ మాత్రం పెట్టుబ‌డులు తెచ్చారో  వివ‌రించాల‌ని రోజా ప్ర‌శ్నించారు... చంద్ర‌బాబు కేవ‌లం అధికార అండ‌తో ప్ర‌జ‌ల సొమ్మును అక్ర‌మంగా  సూటుకేసులతో త‌న ప్ర‌త్యేక విమానంలో త‌ర‌లించి సింగ‌పూర్ లో త‌న కుటుంబంతో సెటిల్ అవ్వాల‌నుకుంటున్నార‌ని రోజా అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.