బాబుకు ఆ హ‌క్కులేదు అంటూ రోజా ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

roja image
Updated:  2018-03-12 04:49:16

బాబుకు ఆ హ‌క్కులేదు అంటూ రోజా ఫైర్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా వైసీపీ ఆవిర్బావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ రోజు కేక్ క‌ట్ చేశారు... ఈ ఆవిర్బావ దినోత్స‌వం సంద‌ర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ... 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని తెలిపారు... ఆయ‌న చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగున ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని రోజా అన్నారు.
 
గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ముఖ్య‌మంత్రి చంద్ర బాబు నాయుడు చేస్తున్న అవినీతి, అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు క్షుణ్ణంగా గ‌మ‌నిస్తున్నార‌ని  రోజా స్ప‌ష్టం చేశారు...తెలుగు దేశం పార్టీ మ‌హిళ‌ల పార్టీ అని ప్ర‌చారం చేసే చంద్ర‌బాబు వారి పార్టీ నుంచి మ‌హిళ‌లు  ఎందుకు వెళ్లిపోతార‌ని అన్నారు... అయితే దీంతో పాటు ఎప్పుడూ  జ‌రుగ‌ని విధంగా బాబు హ‌యాంలో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగాయ‌ని ఫైర్ అయ్యారు రోజా.
 
అందులో భాగంగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌తీ ఒక్క‌రూ  విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ వంటి హామీలు కేంద్రం అమ‌లు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు చేస్తుంటే ముఖ్య‌మంత్రి మాత్రం త‌న‌కేమి ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు... ప్ర‌త్యేక హోదా రాకుండా అడ్డుప‌డుతుంది చంద్ర‌బాబే అని అన్నారు.. తాను ఇరుక్కున్న ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ప్ర‌త్యేక హూదాను వదిలేసుకున్న చంద్రబాబుకు వైఎస్ జగన్ ను విమర్శించే హక్కు లేదని రోజా అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.