చంద్ర‌బాబు నా ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-02 03:05:58

చంద్ర‌బాబు నా ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పు

2014 నుంచి కేంద్రం ప్ర‌భుత్వంతో మిత్ర ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించి ప్యాకేజీకి జై కొట్టిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో తాను ప్ర‌త్యేక హోదా విష‌యంలో యూ ట‌ర్న్ తీసుకోలేద‌ని సభా ముఖంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా చంద్ర‌బాబు అన్న మాట‌ల‌పై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌ల‌లో ఉన్న చిన్న మెద‌డు చిట్లిపోయింద‌ని అందుకే అర్థం ప‌ర్థం లేకుండా మాట్లాడుతున్నార‌ని రోజా మండిప‌డ్డారు.
 
నాలుగు సంవ‌త్స‌రాలు బీజేపీతో అంట‌కాగి  ఇప్పుడు ప్ర‌త్యేక హోదా తెర‌పైకి రాగానే వెంట‌నే కేంద్రానికి విడాకులు ఇచ్చి నేను ప్ర‌త్యేక హోదా విష‌యంలో యూట‌ర్న్ తీసుకోలేద‌ని చెప్ప‌డం సిగ్గు చేట‌ని రోజా విమ‌ర్శ‌లు చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని చెప్ప‌లేద‌ని, కానీ చంద్ర‌బాబు నాయుడు పుణ్యనా అధికూడా జ‌రిగింద‌ని ఆమె ఆరోపించారు.
 
కేవ‌లం త‌న ఆదాయం పెంచుకునేందుకు, కాంట్రాక్టుల కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టార‌ని రోజా ఫైర్ అయ్యారు. త‌మ నాయ‌కుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై కేవ‌లం అవినీతి కేసులు మాత్ర‌మే ఉన్నాయి...కానీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర నాలుగు సంవ‌త్స‌రాల అవినీతి మొత్తం ఉంద‌ని రోజా ఆరోపించారు.  ఈ అక్ర‌మాస్తుల‌పై ప్ర‌ధాని మోడీ ఎందుకు జ‌ప్తు చేయలేదని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ లో సుమారు 250 కోట్ల‌తో ఇల్లు క‌ట్టించుకున్నార‌ని అయితే ఆ ఇంట్లోకి టీడీపీ నాయ‌కుల‌ను ఎందుకు పిల‌వ‌రని రోజా ప్ర‌శ్నించారు. తాను అడిగిన ఈ ప్ర‌శ్న‌కు చంద్ర‌బాబు నాయుడు స‌మాధానం చెప్పాల‌ని రోజా డిమాండ్ చేశారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.