బాబుపై రోజా ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

roja image
Updated:  2018-04-01 06:14:04

బాబుపై రోజా ఫైర్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఎప్ప‌టిక‌ప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తూ ఉంటారు రోజా... అయితే తాజాగా మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మీడియా సాక్షిగా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... 
 
2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు అనేక హామీల‌ను ప్ర‌క‌టించి అధికారాన్నిద‌క్కించుకున్నార‌ని రోజా అన్నారు..  అయితే అధికారాన్ని చేజిక్కించుకొని  సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌స్తున్నాఇంత‌వ‌ర‌కూ 10 శాతం కూడా అమ‌లు ప‌ర‌చ‌లేని నిస్స‌హాయ‌స్థితిలో ఉన్నార‌ని రోజా అన్నారు... ప్ర‌జ‌ల‌ను మోసం చేసే వ్య‌క్తుల‌లో ముఖ్య‌మంత్రి మొద‌టి స్థానం దక్కించుకున్నార‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఓ గ‌జ దొంగలా భ‌విస్తున్నార‌ని అన్నారు..
 
గతంలో చంద్ర‌బాబు కేంద్రంతో ప్యాకేజీల జపం చేసి అమాంత‌రంగా నాలుగేళ్లు వృథాచేశార‌ని మ‌ళ్లీ ఇప్పుడు కొత్త నాట‌కానికి తెర‌లేపుతున్నార‌ని రోజా అన్నారు...ఇప్ప‌టికిప్పుడు టీడీపీ అనూహ్యంగా హోదా కోసం పోరాడుతున్నట్లు ప్రకటించినా వారివ‌ల్ల ప్రయోజనం మాత్రం కనిపించడం లేదన్నారు. నాలుగేళ్లు బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉండి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆమె విమర్శించారు. 
 
రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని భావించి మొద‌టి నుంచి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోరాడుతున్నార‌ని ఫైర్ బ్రాండ్ గుర్తుచేశారు... అధికారంతో సీఎం కుర్చీలో కూర్చొన్న మ‌ఖ్యమంత్రికి ప్ర‌త్యేక హోదాపై ఏం తెలుస‌ని రోజా అన్నారు.... త‌మ నాయ‌కుడు ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న అలుపేరుగ‌ని పోరాటం చూసి ప్ర‌జ‌లే క‌న్నీరు కారుస్తుంటే టీడీపీ నాయ‌కులు మాత్రం త‌మ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు తెలుప‌క కోవ‌డం చాలా సిగ్గుచేట‌ని రోజా అన్నారు... 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.