దగా పోరాటమా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

roja
Updated:  2018-04-29 13:19:33

దగా పోరాటమా?

టీడీపీపైన, చంద్రబాబు పైన, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైనా రాకెట్ వేగంతో మాటల తూటాలు పేలుస్తుంది నగరి ఎమ్మెల్యే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా...అయితే ఇప్పుడు మరో సారి మీడియా స‌మ‌క్షంలో చంద్రబాబు పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే రోజా... వైసీపీ నాలుగేళ్లు నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే, చంద్ర‌బాబు మాత్రం ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టి, హోదా కోసం మద్దతు తెలుపుతున్న విద్యార్థులను అరెస్ట్ చేస్తా అని చెప్పింది నువ్వు కదా చంద్రబాబు? ప్రత్యేక హోదాతో ఏమి ఓరుగదు, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవని అంది నువ్వు కదా బాబు? రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా అంది నువ్వు కదా బాబు? దీక్ష చేస్తే హోదా కేంద్రం ప్రకటిస్తుందా అంది నువ్వు కదా బాబు? అని ఫైర్ అయ్యారు నగరి ఎమ్మెల్యే రోజా.
 
నాలుగేళ్లు పాటు ప్రత్యేక హోదాను అణగదొక్కేందుకు ఉక్కుపాదం చేసిన చంద్రబాబు, ఎన్నికలు దగ్గరకు రావడంతో యూ-టర్న్ తీసుకుని ప్రత్యక హోదా అంటుంది నువ్వు కదా బాబు? దీక్ష చేస్తే ఏమి లాభం లేదు అని ధర్మపోరాట దీక్ష పేరుతో 12 గంటలు ఉపవాసం ఎందుకు ఉన్నావ్ బాబు..అది ధర్మ పోరాట దీక్ష కాదు...అది 12 గంటల ఆడియో ఫంక్షన్ లా ఉంది అని ఎద్దేవా చేసారు నగరి ఎమ్మెల్యే రోజా... 
 
ఓటుకు నోటు కోసం ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టుపెట్టి...ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నావ్ అని ప్రజలు గమనించారు అందుకే ధర్మ పోరాట దీక్ష పేరుతో దగా పోరాటం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నావు...మళ్ళి ఇప్పుడు తిరుపతిలో 30న ధర్మ పోరాటం అని ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావ్...ఆ రోజు ధర్మ పోరాట దీక్ష రోజు కాదు...ఫూల్స్ డే అన్నారు రోజా...నువ్వు ఆడుతున్న నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని  అందుకే బాబు అని కాకుండా యూ-టర్న్ అంకుల్ అని పిలుస్తున్నారు అని ఎద్దేవా చేసారు... 2019 ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ది చెప్తారని అన్నారు ఎమ్మెల్యే రోజా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.