శ్రీదేవి మ‌ర‌ణం పై రోజా విచారం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp-mla-roja
Updated:  2018-02-25 12:20:13

శ్రీదేవి మ‌ర‌ణం పై రోజా విచారం ?

సినీ న‌టి శ్రీదేవి హ‌ఠాన్మ‌రణ వార్త‌ తాను జీర్ణంచుకోలేక పోతున్నాన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, న‌టి రోజా అన్నారు... తిరుమ‌ల‌లో  శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్తున్న స‌మ‌యంలో శ్రీదేవి మ‌ర‌ణ వార్త తెలియ‌గానే చాలా బాధ వేసింద‌ని తెలిపారు...శ్రీవారి ద‌ర్శ‌నం  త‌ర్వాత ఆమె విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ... చిత్ర ప‌రిశ్ర‌మ‌లో శ్రీదేవి అడుగు పెట్టాక డ్రీమ్ గ‌ర్ల్, అతిలోక సుంద‌రిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నార‌ని రోజా అన్నారు.
 
భార‌త దేశంలోనే డ్రీమ్ గ‌ర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి ఇక లేర‌నే వార్త తాను జీర్ణించుకోలేక పోతున్నాన‌న్నారు రోజా... ఆమెను ఆద‌ర్శంగా చేసుకుని అనేక మంది సినిమాల్లో న‌టించార‌ని, అందులో తాను కూడా ఒక‌రిన‌ని చెప్పారు రోజా... అందులో భాగంగానే త‌న‌కు శ్రీదేవి అంటే చాలా ఇష్ట‌మ‌ని, ఆమెను ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఎవ‌రూ ఉండ‌ర‌ని రోజా అన్నారు... ఆమె ఆత్మ‌కు శాంతి క‌లగాల‌ని మ‌న‌స్పూర్తిగా శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని కోరుకున్న‌ట్లు తెలిపారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.