వెరైటిగా చంద్ర‌బాబుపై రోజా ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

roja and chandrababu
Updated:  2018-09-05 15:45:29

వెరైటిగా చంద్ర‌బాబుపై రోజా ఫైర్

2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను మెడికల్ హబ్ గా త‌యారు చేస్తాన‌ని, హామీ ఇచ్చారని కానీ ఆయ‌న అధికారంలోకి వ‌చ్చి సూమారు నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతున్నా మెడిక‌ల్ హ‌బ్ కాదు క‌దా ఆసుప‌త్రిలో మెడిసిన్స్ కూడా స‌ర‌ఫ‌రా చేయించ‌లేక‌పోతున్నార‌ని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆమె త‌న సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని టీడీపీ స‌ర్కార్ ను సూటిగా ప్ర‌శ్నించారు. ఎప్పుడూ మీడియాను వేధిక‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేసే రోజా ఇప్పుడు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు.
 
విజయనగరం జిల్లాలో కొత్తవలస గ్రామ ప్రభుత్వ ఆసుపత్రిలో  గిరిజ‌నులు విష జ్వ‌రాల‌తో అల్లాడుతున్నా కానీ చంద్ర‌బాబు ప‌ట్టించుకోవడంలేద‌ని రోజా ఫైర్ అయ్యారు. టీడీపీ నాయ‌కుల‌కు గిరిపుత్రుల ప్రాణాలు అక్కర్లేదు కానీ వాళ్ల ఓట్లు మాత్రం కావాలాని రోజా మండిప‌డ్డారు. విజయనగరంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు మహిళలకు ఒకే స్టాండ్ సాయంతో సెలైన్లు ఎక్కిస్తున్న, ఒకే బెడ్ పై ఐదుగురు రోగులను కూర్చోబెట్టిన ఫొటోలను ఈ రోజు రోజా ట్వీట్ చేశారు.
roja fires
 
కాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో డెంగూ, మ‌లేరియా జ్వరాల‌తో ఇప్ప‌టికే 9 మంది మ‌ర‌ణించార‌ని సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు విష జ్రాల‌పై స్పందించ‌క‌పోతే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని వైసీపీ ఎమ్మెల్యే హెచ్చ‌రించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.