బాబుపై రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 12:11:40

బాబుపై రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ప్ర‌తిప‌క్ష‌పార్టీ నేత ఫైర్ బ్రాండ్ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి, అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ, వారికి  కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ... అయితే ఇప్ప‌టికే అనేక విష‌యాల‌పై మాట్లాడిన  రోజా కొద్దిరోజులు క్రితం 2018-2019 సంవ‌త్స‌రానికి గాను  ఏపీ బ‌డ్జెట్ లో మ‌హిళ‌ల‌కు ఎలాంటి అవ‌కాశాలు ప్ర‌క‌టించ‌లేద‌ని, త‌మ పార్టీ మ‌హిళ‌ల పార్టీ అని చెప్పుకుని ప్రచారం చేసుకునే ముఖ్య‌మంత్రి  నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌తీ ఒక్క‌రికి అన్యాయం చేస్తూనే ఉన్నార‌ని రోజా విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు రోజా... ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీజేపీ తో చేతులు క‌లుపుతున్నారంటూ వచ్చిన వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని స్ప‌ష్టం చేశారు రోజా.
 
ఒకవేళ మోదీతో జతకడితే కేంద్ర ప్రభుత్వంపై త‌మ నాయ‌కుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడ‌తార‌ని అన్నారు రోజా... ఇదంతా అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న కుట్ర అని తెలిపారు...కాగా ప్ర‌తీ విష‌యాన్ని రాష్ట్ర‌ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు త‌గిన బుద్ది చెబుతార‌ని అన్నారు రోజా.
 
అందులో భాగంగానే మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు మంచోడు అని అన్నారని... ఇప్పుడు గుంటూరులో టీడీపీ నేతలను ప్రశ్నించేసరికి ఆయన చెడ్డ వ్యక్తి అయ్యారా? అని ప్రశ్నించారు రోజా.... ఆర్థిక నేరస్తులలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ1 ముద్దాయిగా అలాగే ఆయన కుమారుడు లోకేష్ ఏ2 ముద్దాయిగా ఉన్నార‌ని అన్నారు..త‌మ నాయ‌కుడు  జగన్ ఆర్థిక నేర‌స్తుడు కాదని రోజా స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.