బ్రేకింగ్ రోజా సంచ‌ల‌న హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla roja
Updated:  2018-09-01 10:54:14

బ్రేకింగ్ రోజా సంచ‌ల‌న హామీ

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న ప‌రిపాల‌న‌పై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ఎప్ప‌టిక‌ప్పుడు నిప్పులు చెరుగుతూనే ఉంటారు. అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి రోజా త‌న వాక్చాతుర్యంతో టీడీపీ నాయ‌కుల‌పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అధికార బ‌లంతో రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ తీసే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని  రోజా మండిప‌డ్డారు. 
 
తిరుమ‌లలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ, పుణ్య‌క్షేత్రం అయిన‌టువంటి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో టీడీపీ నాయ‌కులు వెయ్యికాళ్ల‌ మండ‌పాన్ని తొల‌గించ‌డంపై ఆమె మండిప‌డ్డారు. అధికార బ‌లంతో టీడీపీ నాయ‌కులు మండ‌పాన్ని కూల్చివేడం దారుణం అని అన్నారు. అంతేకాదు అదే విష‌యాన్ని ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఫ‌లితం లేకుండా పోయింద‌ని రోజా ఆరోపించారు. 
 
టీడీపీ నాయ‌కులు మండ‌పాన్ని కూల్చి వేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ రోజా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అంతేకాదు 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే క‌చ్చితంగా వెయ్యికాళ్ల మండ‌పాన్ని తిరిగి నిర్మిస్తామ‌ని రోజా సంచ‌ల‌న హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.