టీడీపీ స‌ర్కార్ ను దుమ్ముదులిపిన రోజా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

roja
Updated:  2018-09-08 11:44:49

టీడీపీ స‌ర్కార్ ను దుమ్ముదులిపిన రోజా

డ్వాక్రా మ‌హిళ‌ల‌ రుణ‌మాఫీపై అధికార తెలుగుదేశం పార్టీ మోసం బ‌ట్ట‌బ‌య‌లు అయింద‌ని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆమె సోష‌ల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు. డ్వాక్రా రుణ‌మాఫీపై టీడీపీ మోసం బ‌ట్ట‌బ‌య‌లు అయింది. అసెంబ్లీ వేదిక‌గా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాలమాఫీ చెయ్య‌లేద‌ని మంత్రి ప‌రిటాల సునిత లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు. 
ycp
 
డ్వాక్రా రుణాల మాఫీపై లేఖ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు అడిగిన‌ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఎటువంటి రుణాలు మాఫీ చెయ్య‌లేద‌ని మంత్రి ప‌రిటాల సునిత స‌మాధానం ఇచ్చారు. 2014 నాటికి ఉన్న రుణాల‌పై ఎటువంటి మాఫీ చెయ్య‌లేద‌ని వెల్ల‌డించారు. అలాగే డ్వాక్రా రుణామాఫీ చేసే ఆలోచ‌న ఉందా అనే ప్ర‌శ్న‌కు రుణ‌మాపీ చేసే ఆలోచ‌న లేద‌ని స‌భ‌లో స‌మాధానం ఇచ్చారు.
roja tweet
 
చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన స‌మయానికి 14200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయి. అయితే చంద్ర‌బాబు మాత్రం బ‌హిరంగ స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు పూర్తిగా డ్వాక్రా రుణ‌మాఫీ చేసిన‌ట్లు ప్ర‌చారం చెయ్య‌డం గ‌మ‌నార్హం అంటూ రోజా ట్వీట్ చేశారు.