విజ‌య‌సాయిరెడ్డిని ప్ర‌శ్నించే నిప్పుకి సూటి ప్ర‌శ్నలు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy ycp mp
Updated:  2018-03-27 12:26:59

విజ‌య‌సాయిరెడ్డిని ప్ర‌శ్నించే నిప్పుకి సూటి ప్ర‌శ్నలు ?

సైకిల్ పార్టీ నాయ‌కులు రోజూ విజ‌యసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే... వైసీపీ ఎందుకు బీజేపీతో స‌యెధ్యకు జ‌త‌క‌ట్ట‌డానికి  రెడీ అవుతోంది ....ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎందుకు దిల్లిలీ పీఎంవో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అని అంటున్నారు వారికి సూటి ప్ర‌శ్న‌లు..?
 
ఓ ముఠానాయ‌కుడికిపార్టీ త‌ర‌పున కొమ్ముకాయ‌డం మీపార్టీ చేయ‌లేదా?
 
అధికార పార్టీ లో ఉన్న మంత్రిని కొడితే, ఆ ఎమ్మెల్యేకి ఇప్పుడు రెండు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డింది, అత‌ను మీ పార్టీ కాదా?  అత‌ను ఎమ్మార్వో పై దాడి చేయ‌లేదా?
 
ఏలూరు లో పార్టీ  ఆఫీసులోనే  పేకాట క్లబ్బు లు నిర్వహించిన  నాయ‌కుడు మీ పార్టీకాదా?
 
కాల్ మ‌నీ కేసులో కీల‌క నింధితుడు మీ పార్టీలో నాయ‌కుడు కాదా, ఎంత మంది మ‌హిళ‌ల పై అనుచిత ప్ర‌వ‌ర్త‌న చేశారో వారు నీకు తెలియ‌దా? అత‌నిని మీ పార్టీ త‌ర‌పున ఎంఎల్ సీ చేయ‌లేదా?
 
ప్ర‌కాశంలో యావ‌జ్జీవ శిక్ష‌ప‌డిన నాయ‌కుడికి ప‌ద‌వి ఇవ్వ‌లేదా?  మీ పార్టీలో లేడా 
 
వైఎస్ఆర్ తండ్రి రాజా రెడ్డి ని చంపిన నేరస్తులకు మీ పార్టీలో  ఆశ్రయం ఇవ్వలేదా ?
 
రాయ‌ల‌సీమ‌లో పేరున్న నాయ‌కుడు యావ‌జ్జీవ శిక్ష‌ప‌డిన మాజీ మంత్రి మీ పార్టీలో లేడా ?
 
నీ బంధువు ఎమ్మెల్యే ఓ సినిమా రంగానికి చెందిన వ్య‌క్తిని కాల్చ‌లేదా? 
 
స్టాంపుల కుంభకోణం లో శిక్షపడి పూణే  జైలు లో ఉండి వచ్చిన క్రిష్ణ యాదవ్ కి ఆశ్ర‌యం ఎవ‌రు ఇచ్చారు?
 
2009 ఎలక్షన్లలో అత్యధికం గా నేరస్తులు ఉన్న పార్టీ మీదే అని సత్తా పార్టీ ప్రకటించలేదా?.
 
హత్య కేసులు, ఇంట్లో బాంబులు పేలిన కేసు ఉన్న వ్యక్తి మీ పార్టీ లో ఇప్పుడు ఎంతో గౌరవంగా ఉండాల్సిన  ఒక రాజ్యాంగ పదవిలో లేడా ?
 
చెరుకులపాడు నారాయణ రెడ్డి ని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్నవారు మీ పార్టీలో ఎలా కొన‌సాగుతున్నారు వారికి సీటు ఇవ్వ‌డానికి ఉత్సాహం చూప‌డం లేదా 
 
రంగా హత్య కేసులో ముద్దాయి గా ఉన్న వ్య‌క్తులు మీ పార్టీలో లేరా ?
 
అస‌లు ఏ త‌ప్పు చేయ‌క‌పోతే స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు... ఊరికే విజ‌య‌సాయిరెడ్డిని టార్గెట్ చేయడం మీకు ష‌రామాములే... విష‌యం ఉన్న‌వారిని కెలికితేనే క‌దా మీ స‌త్తా తెలిసేది అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.