వైసీపీలోకి రీ ఎంట్రీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp and tdp
Updated:  2018-06-14 03:51:56

వైసీపీలోకి రీ ఎంట్రీ

అధికార తెలుగుదేశం పార్టీకి 1983 నుంచి కంచుకోట‌గా వ‌స్తున్న నియోజ‌కవ‌ర్గం అన‌కాప‌ల్లి గ‌తంలో టీడీపీ త‌ర‌పున పోటీచేసిన రాజా క‌న్న‌బాబు త‌ర్వాత దాడి వీర‌భ‌ద్ర‌వావు టీడీపీ త‌ర‌పున అన‌కాప‌ల్లిలో పోటీ చేసి హ్యాట్రిక్ విజ‌యాన్ని సాధించారు.ఆ త‌ర్వాత 2004లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తర‌పున పోటీ చేసిన శ్రీనివాసురావు త‌న ప్ర‌త్య‌ర్థి అయిన వీర‌భ‌ద్ర‌రావు పై అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీనివాస‌రావు టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టార‌నే చెప్పాలి. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత 2014 లో మొద‌టి సారిగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిగాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన గోవింద‌స‌త్య‌నారాయ‌ణ త‌న ప్ర‌త్య‌ర్థి కొణ‌తాలర‌ఘునాథ్ పై విజ‌యం సాధించి మ‌రోసారి పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చారు స‌త్య‌నారాయ‌ణ‌. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఆదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి త‌న స‌త్తా చాటాల‌ని స‌త్య‌నారాయ‌ణ చూస్తున్నారు. 
 
అయితే తాజాగా ఈ సీటుపై మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి క‌న్నేశార‌ట‌. త్వ‌ర‌లో ఈయ‌న టీడీపీలో చేరుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆయ‌న పార్టీలో చేరే ముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు ష‌ర‌తుల‌తో కూడిన ఒప్పందం కుదుర్చుకున్నార‌ని తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. విశాఖ ఉత్తరం, జిల్లాలోని అనకాపల్లి, మాడుగుల అసెంబ్లీ నియోజకవ‌ర్గాల్లో ఆయ‌న ఏ సీటు కోరితే ఆ ఇవ్వాల‌ని చెప్పారట‌.
 
అయితే ఇందుకు చంద్ర‌బాబు నాయుడు సుముఖంగా స్పందించి ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ అడిగితే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ ఇవ్వ‌డాని రెడిగా ఉన్నార‌ని వార్త‌లు వస్తున్నాయి. ఇక స‌బ్బం హ‌రి మాత్రం అన‌కాప‌ల్లి నుంచి పోటీ చేసి మంత్రి అవ్వాల‌ని కోరుకుంటున్నార‌ట‌. ఇక ఇదే విష‌యాన్ని త‌న అనుచ‌రులు కూడా చెప్పార‌ట‌. ఆయ‌న టీడీపీలో చేరితే మ‌రోసారి అధికారంలో ఉండి విశాఖ‌లో చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్నార‌ట‌. 
 
అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఆయ‌న పుట్టిన రోజున‌ చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకుంటార‌ని స‌బ్బం అనుచ‌రుల‌తో పాటు టీడీపీ నాయ‌కులు కూడా భావించారు. కానీ ఆయ‌న టీడీపీలో చేర‌లేదు. ఇక ఆయ‌న ఎప్పుడు టీడీపీలో చేరుతారన్న విష‌యాన్ని తేల్చకపోవడంతో అటు టీడీపీ హై కమాండ్ తో పాటు టీడీపీ నేత‌ల్లో టెన్షన్ పెరిగిపోతోంది. గతంలో హ‌రి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్మించిన వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ త‌ర్వాత ఆయ‌న బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక తాజాగా హరి టీడీపీలో చేరుతారంటు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే స‌బ్బం హ‌రి మాత్రం ఇంత వ‌ర‌కు టీడీపీలో చేరుతార‌ని చెప్ప‌లేదు. కాబట్టి రానున్న రోజుల్లో మ‌ళ్లీ జగన్ పిలిస్తే వైసీపీ వైపు కూడా  వెళ్తారేమోనన్న అనుమాleలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైప్ప‌టికి స‌బ్బం హ‌రి మాత్రం ప్ర‌తిప‌క్షంలో లేకున్నా కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని ఓ ఆట ఆడుతున్నార‌నే చెప్పాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.