చంద్ర‌బాబుకు స్టాంప్ వేసిన స‌బ్బంహ‌రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:48:53

చంద్ర‌బాబుకు స్టాంప్ వేసిన స‌బ్బంహ‌రి

తెలుగుదేశానికి పార్టీ స‌పోర్ట‌ర్స్ క‌న్నా  బ‌య‌ట నుంచి ఉన్నా స‌పోర్ట‌ర్స్ ఫాలోవ‌ర్స్ ఎక్కువు ఉన్నారు.. ముఖ్యంగా ఇప్పుడు కాదు బాబు చేతిలోకి పార్టీ వెళ్లిన స‌మ‌యం నుంచి  ఇదే పందా అనుస‌రిస్తున్నారు..  విశ్వంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడికి లేని ఫాలోయింగ్ కూడా తెలుగుదేశం అదినేత చంద్ర‌బాబు కు ఉంది అంటారు.. అస‌లు విష‌యాలు ఎలా ఉన్నా, టీడీపీకి ఆత్మ‌బంధువు సొంత బంధువులు తెలుగుదేశం నాయ‌కులు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వెన్న‌ముక కార్య‌క‌ర్త‌లు ఎలాగో, ఇలాగే పార్టీకి వెన్న‌ముక బ‌య‌ట నాయ‌కులు ఉన్నారు కొందరు.. వారి అంద‌రిని బాబు ఏదో ప‌ద‌వి ఇచ్చి త‌న చుట్టూ ఉంచుకుంటారు టీడీపీ కుటుంబం త‌ర‌పున‌.
 
ఇక పార్టీలో లేక‌పోయినా  చంద్ర‌బాబుకు స‌పోర్ట్ చేయడంలో చాలా మంది ముందు ఉంటారు.. పార్టీ త‌ర‌పున వీరికి ఎటువంటి స‌మాచారం అందుతుందో తెలియ‌దు కాని బాబు పై ఎటువంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా, సొంత పార్టీ నాయ‌కుల క‌న్నా ఇలాంటి నాయ‌కులు ముందు బ‌య‌ట‌కు వ‌స్తారు....ఇక స‌బ్బం హ‌రి ఉత్త‌రాంధ్రా  రాజ‌కీయాల్లో సీనియ‌ర్ అనే బిరుదు అందుకున్న నాయ‌కులు... కాంగ్రెస్ వైసీపీ ఇప్పుడు మ‌ళ్లీ ఏ పార్టీలో చేరాలి అనే ఆలోచ‌న‌లో ఉన్న సీనియ‌ర్ ఎంపీ.
 
ఆలోచ‌న‌లో ఉంటే ఒకే కాని చంద్ర‌బాబు సామ‌ర్ధ్యాన్ని అర్జునుడి లెక్క పొగుడుతూ మిగిలిన వారు అంతా క‌రివేపాకులు అనేలా తీసి పారేస్తున్నారు.. ఇటు జ‌గ‌న్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అస‌లు  సీట్లు కాదు క‌దా డిపాజిట్లు గెలుచుకోలేరు అనేలా సెల‌విస్తున్నారు.. పోని ఇక్క‌డ చంద్ర‌బాబు అంత‌టి మ‌హొత్తర అభివృద్ది ఏంచేశారు అంటే ? ఆయ‌న అంత సీనియ‌ర్ ఎవ‌రు లేరు అంటారు.
 
ఇక ఇటీవ‌ల సొంత మీడియా  చేసిన స‌ర్వే పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. ప‌ది సెగ్మెంట్ల‌లో స‌ర్వే చేసి మొత్తం ఇలాగే రాష్ట్రం ఫ‌లితాలు ఉంటాయి అని చెప్ప‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిటి అని విమ‌ర్శ‌లు వినిపించాయి.. ఇటు స‌బ్బం హ‌రి మ‌రోసారి చంద్ర‌బాబుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత గెల‌వ‌డం ఖాయం సీఎం ఆయ‌నే అవుతారు అలాగే టీడీపీ అధికారంలోకి వ‌స్తుంది.. ఈ మాటలు వార్త‌లు విన్న టీడీపీ నాయ‌కులు అంద‌రూ స‌బ్బంహ‌రికి కితాబిచ్చారు అక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది..
 
 ఇటు జ‌గ‌న్ ప‌వ‌న్ క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారట‌.. ఇటు బీజేపీ, జ‌న‌సేన, వైసీపీ అంతా క‌లిసిపోతాయి అని చెబుతున్నారు.. అదే అచ్చు వేసింది స‌దరు సంస్ద....ఉత్త‌రాంధ్రాలో ఇలా త‌ట‌స్ధంగా ఉన్న నాయ‌కులు ఎవ‌రైనా ఉన్నారా అంటే అది స‌బ్బం హ‌రే ... కాని ఇప్పుడు తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆ ట్యాగ్ లైన్ కూడా తీసేలా చేసేశాయి.. ఆయ‌న కొద్దిరోజులుగా తెలుగుదేశం తీర్దం పుచ్చుకుంటారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.. ఇక ఈ రూమ‌ర్ల‌కు సెల‌వు ఇచ్చారు ఆయ‌న, తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాఅని బ‌దులిచ్చారు అదే సంస్ద‌కు.
 
అయితే అది ఏ పార్టీ అనేది ఇప్పుడు చెప్ప‌ను అన్నారు.. అంతా బాగుంది ప్ర‌స్తుతం తెలుగుదేశం వైసీపీ జ‌న‌సేన ఇక పాత ఇళ్లు కాంగ్రెస్ ఎలాగో ఉన్నాయి.. అయితే సీటుతో పాటు ప‌లు హామీలు కూడా ఉంటాయి.. అవ‌న్నీ తీర్చితే క‌చ్చితంగా పార్టీలో ఎవ‌రైనా చేరుతారు.. అదే దారి స‌బ్బంహ‌రిది. ఇక ఇక్క‌డ ఆలోచించాల్సిన అంశం బాబును గెలిపిస్తే మోడీ ఓడిన‌ట్లే అని ఓ ప్ర‌క‌ట‌న చేశారు.
 
ఇక స‌బ్బంహ‌రి తెలుగుదేశానిక వ‌స్తే ,ఇటు వైసీపీ త‌ర‌పున కొణ‌తాల పార్టీలో చేరి నిల‌బ‌డితే, జ‌న‌సేన త‌ర‌పున దాడి వీర‌భ‌ద్ర‌రావు నిల‌బడితే, ఇటు అన‌కాప‌ల్లి ప్ర‌స్తుత ఎంపీ అవంతి ఎమ్మెల్యేగా వెళితే.. అబ్వా ప‌క్కా రాజ‌కీయ వేడి ఇప్పుడు ఇక్క‌డ క‌నిపిస్తుంది.. ఉత్తారంధ్రా అంతా వెలుగుతోంది అనకాప‌ల్లి రాజ‌కీయ వేవ్స్ తో.. ఇది జ‌ర‌గ‌డం ప‌క్కా అని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.. బెల్లం అడ్డా అన‌కాప‌ల్లిగ‌డ్డలో.. అయితే స‌బ్బం అన్నీ క్లియ‌ర్ చేసుకుని టీడీపీలోకి మ‌ళ్లీ గృహ‌ప్ర‌వేశం చేస్తారు.. అప్ప‌టి వ‌ర‌కూ గ‌ప్ చుప్.. ఇలా రాజ‌ముద్ర‌లు స్టాంప్ లు వేయడం అనేది పార్టీలోకి వెళ్లి చేస్తే దానికి ఓ అర్దం ఉంటుంది అని అంటున్నారు విశ్లేష‌కులు.
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.