సాయికుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-24 14:53:23

సాయికుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రానికి ప్ర‌త్యేక‌ హోదా ప్ర‌క‌టించాలంటూ త‌న జ‌న్మ‌దినం రోజైన ఈ నెల  20 న ధ‌ర్మ‌పోరాట‌ దీక్ష పేరుతో విజ‌య‌వాడ‌లో 12 గంట‌లు కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌హార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే... ఈ దీక్ష‌లో హిందుపూరం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ, ప్ర‌ధాని మోడీ కొజ్జా రాజ‌కీయాలు చేస్తున్నారంటూ  చంద్ర‌బాబు స‌మ‌క్షంలో రెచ్చిపోయి మాట్లాడారు...
 
అయితే బాల‌య్య‌ చేసిన వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూ బీజేపీ నాయ‌కులు ఆయ‌న నివాసం వ‌ద్ద భైటాయించి వెంట‌నే ప్ర‌ధానికి క్ష‌మాప‌న చెప్పాల‌ని వారు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేశారు అలాగే గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేశారు... ఎన్టీఆర్ త‌న‌యుడు అయ్యిండి ఆయ‌న‌కు చెడ్డ‌పేరు తీసుకువ‌స్తున్నారు అని బీజేపీ విమ‌ర్శించింది.
 
ఇక తాజాగా బాల‌య్య చేసిని వ్యాఖ్య‌ల‌పై సినీ నటుడు హీరో ప్ర‌తినాయ‌కుడిగా అల‌రిస్తున్న‌,  సాయికుమార్ స్పందించారు.... ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాల‌కృష్ణ ప్ర‌ధాని మోడీపై చేసిన వ్యాఖ్య‌లు స‌రైన‌వి కావ‌ని వెంట‌నే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లను వెన‌క్కి తీసుకోవాల‌ని సాయికుమార్ సూచించారు... బాల‌కృష్ణ ఎమ్మెల్యే ప‌ద‌విలో ఉండి దేశ ప్ర‌ధానిని ఇష్టానుసారం మాట్లాడ‌డం మంచిది కాద‌ని తెలిపారు. 
 
బీజేపీ పై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్ప‌ని ప్ర‌ధాని మోదీని అంద‌రి ముందు అలా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాదు అని తెలియ‌చేశారు.. అవ‌స‌రం అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకొని న్యాయం చేయమని అడుగుతానని చెప్పారు సాయికుమార్.
 
ఇక  కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో చిక్బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్‌ పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి హీరో బాలకృష్ణను పిలవడం లేదని ఆయన తెలిపారు... ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నామ‌ని తెలిపారు. ఇక తెలుగులో కంటే క‌న్న‌డ‌లో సాయికుమార్ హీరోగా అక్క‌డ మంచి పేరు ఉంది... ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ జేడీఎస్ కు పోటీగా ఇక్క‌డ అభ్య‌ర్దుల‌ను బ‌ల‌మైన వారిని బ‌రిలోకి నిలుపుతోంది 
 
మ‌రో ప‌క్క కాంగ్రెస్ కు క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో ప్ర‌చారాని మెగాస్టార్ చిరంజీవి వ‌స్తారు అని తెలుస్తోంది... ఇటు జేడీఎస్ కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారానికి వెళ‌తారు అని వార్త‌లు వ‌స్తున్నాయి మ‌రి చూడాలి బీజేప త‌ర‌పున గ‌తంలో నిల‌బ‌డిన వారు మంత్రులుగా చేసిన వారికి అలాగే గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కోట‌రి వ్య‌క్తుల‌కు బీజేపీ అధిష్టానం సీట్లు కేటాయించింది. ఇటు బీజేపీ కోటి మందికి పైగా తెలుగువారు ఉన్న క‌ర్నాట‌క‌లో కొత్త‌గా ప్ర‌చారం చేయాల‌ని యోచిస్తోంది. తెలుగువారిని ఆక‌ట్టుకోవాలి అని సినీ గ్లామ‌ర్ ను వాడుకోవాల‌ని ఆలోచిస్తున్నాయి ఈ త్రిముఖ పోరులోని పార్టీలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.