జ‌గ‌న్ కు జై కొట్టిన సాయికుమార్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 11:31:36

జ‌గ‌న్ కు జై కొట్టిన సాయికుమార్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఏ విధంగా హ‌ట్ హాట్ గా జ‌రుగుతుందో , క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా అదే స్థాయిలో జ‌రుగుతోంది... ముఖ్యంగా క‌ర్ణాట‌క‌లో బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నేత‌లు అధికార‌మే లక్ష్యంగా చేసుకుని విస్రృతంగా ప్ర‌చారం చేస్తున్నారు... బీజేపీ త‌ర‌పున క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు హీరో సాయికుమార్... అయితే ఇదే క‌ర్ణాట‌క‌లో గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలు అయ్యారు సాయికుమార్... ఇక ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ఎన్నికల్లో ఎలాగైనా గెల‌వాల‌నే నేప‌థ్యంతో విస్రృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు సాయి కుమార్.
 
ఇక తాజాగా ఈ రోజు ప్ర‌చారంలో మాట్లాడుతూ... ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు పై, అలాగే ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సాయి కుమార్... 2014 ఎన్నిక‌ల్లో  బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా  వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు స్వార్థ రాజ‌కీయాలు చేశార‌ని మండిప‌డ్డారాయ‌న‌.
 
తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు ఏపీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తాన‌ని, ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ క‌న్నా అద్భుతంగా తీర్చి దిద్దుతానని, అలాగే ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పార‌ని సాయికుమార్ గుర్తు చేశారు.... అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితిని బ‌ట్టి చూస్తుంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి సంబంధించి ఒక్క స్థిర‌మైన బిల్డింగ్ కూడా క‌ట్ట‌లేని పరిస్థితిలో చంద్ర‌బాబు ఉన్నార‌ని సాయికుమార్ విమ‌ర్శించారు.
 
అలాగే ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు నాలుగు సంవ‌త్సరాలుగా మాట మార్చుతూనే ఉన్నార‌ని ఆరోపించారు... ఒక‌సారి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటార‌ని, మ‌రోసారి మాట మార్చి ప్ర‌త్యేక హోదా బ‌దులు త‌మ‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ కావాలంటూ మాట‌ మార్చారంటూ గుర్తుచేశారు సాయికుమార్...అయితే ప్ర‌త్యేక‌ హోదా విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం నాలుగు సంవ‌త్స‌రాల పాటు ఒకేమాట మీద నిబ‌డ్డార‌ని గుర్తు చేశారు.
 
అయితే ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను బట్టీ చూస్తుంటే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఎక్కుగా క‌నిపిస్తోంద‌ని సాయికుమార్ తెలిపారు...అలాగే ప్రస్తుత  ప్రతికూల పరిస్థితులు చూస్తుంటే తెలుగుదేశం నాయ‌కులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని సాయికుమార్ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.