విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sai reddy
Updated:  2018-10-25 06:27:19

విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా ఫైర్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగి దాడిని ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు ఆయ‌న‌.
 
వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. అత్యంత కట్టుదిట్టమైన  భద్రత ఉన్న ఎయిర్ పోర్ట్ లోనే ఆయనపై కత్తితో జరిగిన దాడి కచ్చితంగా కుట్రే. కుట్ర వెనుక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలి.
 
మ‌రో ట్వీట్ చేస్తూ జగన్ మోహ‌న్ రెడ్డి భద్రత, రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలని గతంలో చేసిన అనేక విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చివరకు ఆయన ప్రయాణించే వాహనాలు సైతం తరచుగా మరమ్మతులకు గురవుతూ మొరాయిస్తున్నా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా.
 
జగన్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఆయన అభిమానేనట. పబ్లిసిటీ కోసమే దాడి జరిగిందట. ఎయిర్ పోర్ట్ లో జరిగింది కాబట్టి అది పోలీసుల బాధ్యత కాదట. హత్యాయత్నం ఘటనపై విచారణ చేయకముందే డీపీజీ చేసిన వ్యాఖ్యలతో కుట్రను నీరుగార్చే ఉద్దేశం స్పష్టమవుతోంది.

షేర్ :

Comments

0 Comment