ఈసారి బాబుకు అవార్డు ఖాయం....విజ‌య‌సాయి రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sai reddy and chandrababu
Updated:  2018-10-12 12:12:02

ఈసారి బాబుకు అవార్డు ఖాయం....విజ‌య‌సాయి రెడ్డి

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై మ‌రోసారి ప్ర‌తిక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు. ఈ మేర‌కు అయ‌న స‌ర్కార్ ను ప్ర‌శ్నిస్తూ ట్వీట్ కూడా చేశారు. కరువుతో సీమ రైతాంగం గొల్లుమంటోంది. అయితే తాజాగా చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో రైతులను ఆదుకునేందుకు తక్షణ సాయం ప్రకటిస్తారని అన్నదాతలు వేయి కళ్ళతో ఎదురు చూశారు. ఆశ్చర్యంగా, దాని ఊసే ఎత్తకుండా బాబు రాజకీయ విమర్శలకు దిగారు అని ట్వీట్ చేశారు.. ఉసురుమంటూ రైతులు ఇంటి దారి పట్టారు. బాబుకు ఈసారి రైతు బంధు అవార్డు ఖాయం అన్నారు.
 
అనంతలో లక్ష పంట కుంటలతో కరువు అనేది కనిపించకుండా బాబు తరిమికొట్టారట..! అందుకే సీమలో నీరు లేక 12 లక్షల ఎకరాల్లో పత్తి, శెనగ పంటలు ఎండిపోయాయి. పశువులకు సైతం గడ్డి దొరకని స్థితిలో రైతన్నలు వాటిని ఆదోని వారపు సంతలో తెగనమ్ముకుని వలసలకు సిద్ధపడుతున్నార‌ని ట్వీట్ చేశారు.
 
అనంతపురం జిల్లాలో నిన్న లక్ష పంట కుంటను చూసి బాబు కళ్ళు ఆనందంతో చెమర్చాయట! రెయిన్ గన్లు, పంట కుంటలతో రాయలసీమలో కరువును తరిమి కొట్టినందుకు తన వీపు తానే చరుచుకున్నారట. ఆ వెంటనే అనంతపురం జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. హతవిధీ..! ఎంత విచిత్రం అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.