టీడీపీ వ్యభిచార పార్టీ విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-09 13:13:14

టీడీపీ వ్యభిచార పార్టీ విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో తీర్చి దిద్దుతామ‌ని చెప్పి ర‌క్త‌పు మ‌డుగులోనే ఉంచేసిన‌టువంటి పార్టీ భార‌తీయ జ‌న‌తాపార్టీ అని వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఇటు కాంగ్రెస్ పార్టీ అటు భార‌తీయ జ‌న‌తా పార్టీలు ఏపీకి తీవ్రస్థాయిలో అన్యాయం చేశాయ‌ని ఆయ‌న ఆరోపించారు.  
 
తెలుగు రాష్ట్రాల‌ను విభ‌జించేట‌ప్పుడు ప్ర‌జ‌లకు అర‌చేతిలో స్వ‌ర్గం చూపించార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు. గ‌తంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే అవ‌కాశం ఉన్నా కూడా దానికి చ‌ట్టంలో పొందుప‌ర‌చ‌కుండా ఈ అంశాన్ని కంటినీటి తుడుపుగా రాజ్య‌స‌భ‌లో అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి హామీ ఇచ్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇక రైల్వే జోన్ విష‌యంలో కూడా మోసం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదాను చ‌ట్టంలో పొందుప‌రిచి ఉంటే ఇప్పుడు బీజేపీ ప్ర‌భుత్వం ఇచ్చేద‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని విభ‌జించి కాంగ్రెస్ పార్టీ తీర‌ని అన్యాయం చేసింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. 
 
అంతేకాదు గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఐదు సంవ‌త్స‌రాలు కాదు ప‌ది సంవ‌త్స‌రాలు కేటాయిస్తామ‌ని చెప్పారు. కాదు త‌మ‌కు 15 సంవ‌త్స‌రాలు కావాల‌ని టీడీపీ నాయ‌కులు కోరారు. అయితే ఈ రెండు పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన‌ త‌ర్వాత  వారు ఇచ్చినటువంటి హామీల‌ను మ‌రిచి రాష్ట్రానికి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని ద్రోహం చేశార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.  అంతేకాదు టీడీపీ నాయ‌కులు గ‌తంలో ఇటు కాంగ్రెస్ తోను అటు బీజేపీలో లాలూచీ రాజ‌కీయాలు చేశార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఈ రెండు పార్టీల‌తో కాపురం చేసి, సంసారం చేసి రాజ‌కీయ వ్య‌భిచారం చేస్తున్న‌టువంటి పార్టీ తెలుగుదేశంపార్టీ అని విజ‌య సాయి రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.
 
అందుకే తాము ఈ మూడు పార్టీల‌ను న‌మ్మ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు రెండు రోజుల వ‌ర‌కు కూడా డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వి పోటీకి త‌మ అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేదు దాని మిత్ర‌ప‌క్షాలైన‌టువంటి ఎన్ సీపీ, కానీ ఎస్పీ కానీ బీఎస్పీ బ‌ల‌ప‌రుస్తామ‌ని చెప్పారు. ఇక ఇప్పుడు స‌డ‌న్ గా త‌మ అభిప్రాయాల‌ను మార్చుకుని కాంగ్రెస్ పార్టీ మిత్ర ప‌క్షాల‌కు ఇవ్వ‌కుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని నిల‌బెట్టారు. అయితే ఇది వైసీపీకి ఆమోద‌యోగ్య‌మైన‌ది కాద‌ని విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇటు కాంగ్రెస్ నాయులు అటు బీజేపీ నాయ‌కులు ఎవ‌రిని నిల‌బెట్టినా కూడా వారికి వ్య‌తిరేకంగా ఓటు వేస్తామ‌ని ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.