చంద్ర‌బాబు న‌కిలీ న‌క్సల్స్ ను పెట్టుకున్నారు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp leaders
Updated:  2018-10-29 17:24:03

చంద్ర‌బాబు న‌కిలీ న‌క్సల్స్ ను పెట్టుకున్నారు...

ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్ రావు, బొత్సస‌త్య‌నారాయ‌ణ, మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు క‌లిసి తాజాగా కేంద్ర మంత్రుల‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఆప‌రేష‌న్ గ‌రుడపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు రాష్ట్ర‌ప‌తిని క‌లిసి విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ కూడా చేశారు. 
 
విశాఖపట్నం విమానాశ్రయంలో త‌మ‌పార్టీ అధినేత వైయఎస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నంపై కేంద్ర దర్యాప్తు బృందం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని వైఎస్సార్ కంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఈ రోజు సమావేశం అయ్యామని విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు..
 
మ‌రో ట్వీట్ చేస్తూ ప్రజా హృదయ నేత వైఎస్ జగన్ కి అత్యున్నత‌ భద్రత కల్పించాలి. అధికార యంత్రాంగాన్ని బాబు ధ్వంసం చేశాడు. అన్ని చోట్ల తన మనుషులను పెట్టుకున్నాడు. నకిలీ నక్సల్స్ పేరిట అనేక మందిని హతమార్చిన చరిత్ర బాబుది. దీనిని ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించేలా చూస్తున్నాడు బాబు అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.
 
Speaking to media soon after YSRCP delegation met Union Home Minister Rajnath Singh at his residence today morning demanding an impartial probe by Central agencies over murder attempt