విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 15:09:53

విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విజయసాయి రెడ్డి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన టీడీపీ పైనా, చంద్రబాబుపైనా, లోకేష్ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తారు.టీడీపీ చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేతలు..ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరోసారి చద్రబాబుపైన సంచలన వ్యాఖ్యలు చేశారు.. 
 
ఎవరిపైన ధర్మ పోరాటం చేస్తున్నారు...అధికార యంత్రాంగాన్ని మీ చేతుల్లో పెట్టుకుని ప్రజల మీద మీ పోరాటం. ప్రజలకు న్యాయం చేయాల్సిన మీరు ప్రజలను దోచుకుంటున్నారు...రాష్ట్ర ఖజానాని దోచుకుంటున్నారు. అధర్మమైనటువంటి పనులు, అన్యాయమైన పనులు, చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్న మీరు ప్రజలను మోసం చేయడానికి ధర్మ పోరాటం అంటారా..?అని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి. 
 
ఒక వైపు ధర్మం అంటూనే మరో వైపు దోచుకుంటారని మండిపడ్డారు...తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ , తెలుగు డ్రామాల పార్టీ  తెలుగు ద్రోహుల పార్టీ ...అలాంటి ద్రోహుల పార్టీకి, దొంగల పార్టీకి, డ్రామాలా పార్టీకి అధినాయకుడు చంద్రబాబు నాయుడు..సుమారు 3 లక్షల కోట్ల రూపాయలను ప్రజా సొమ్మును ఖజానా నుంచి కొల్లగొట్టి , ధర్మ పోరాటం పేరుతో తెలుగు దొంగల పార్టీ మోసం చేస్తుంది అని ఆరోపణలు చేశారు విజయసాయి రెడ్డి.
 
తెలుగుదేశం పార్టీ సభలు పెట్టి చేస్తుంది ధర్మ పోరాటం కాదు, అధర్మాన్ని కొనసాగించేందుకు చేస్తున్న ఒక దృష్ప్రయత్నం మాత్రమే... నాలుగు సంవత్సరాల పాటు 3 లక్షల రూపాయలు దోచుకొని, విదేశాలకు తరలించారు, అది సరిపోక ఇప్పుడు దేవాలయాల మీద పడ్డారు..చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి దొంగల పార్టీ అని నిరూపిస్తాం, చంద్రబాబు ఒక దొంగ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.