చంద్ర‌బాబు అందుకు అన‌ర్హుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sai reddy and cbn
Updated:  2018-10-27 12:21:44

చంద్ర‌బాబు అందుకు అన‌ర్హుడు

ప్ర‌తిక్షనే త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి పై జ‌రిగిన దాడిని ఖండిస్తూ ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. బాబుకు పచ్చ కామెర్లు బాగా ముదిరినట్లుంది. సీఎం స్థాయి మరిచి గల్లీ నేత కంటే ఘోరంగా మాట్లాడుతున్నాడు. జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించిన ఇతర పార్టీలను విమర్శించడం చూస్తుంటే ఆయనకు మతి భ్రమించింది అనిపిస్తుంది. సీఎంగా కొనసాగడానికి అనర్హుడు.
 
మ‌రో ట్వీట్ చేస్తూ జగన్ పై హత్యాయత్నం జరిగిన గంటలోనే నిందితుడు ఆయన ఫ్యాన్ అని, పబ్లిసిటీ కోసమే దాడి చేశాడని బాబు ఆదేశాల మేరకు స్వయంగా డీజీపీనే జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ఏస్థాయి దర్యాప్తు జరిపినా అది సీఎం, డీజీపీ జడ్జిమెంట్ కు భిన్నంగా ఎలా ఉంటుంది అని విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.
 
హత్యాయత్నం ఎయిర్ పోర్ట్ లోపల జరిగింది కాబట్టి అది సీఐఎస్ఎఫ్ బాధ్యత అంటూ డీజీపీ చేతులు దులుపుకున్నారు. ప్రతిపక్ష నేత సెక్యూరిటీ ప్రొటోకాల్ పై డీజీపీకి ఆమాత్రం అవగాహన లేదా..? ఒక వీఐపీ ఎయిర్ పోర్ట్ లోని సెక్యూరిటీ ఏరియాలోకి వెళ్ళే వరకు రక్షణ కల్పించే బాధ్యత పోలీసులదే అని తెలియదా..?
 
జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి డీజీపీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న గవర్నర్ పై బాబు దుమ్మెత్తి పోస్తున్నారంటే ఏమనుకోవాలి..? ఈ దేశ రాజ్యాంగానికి, ఫెడరల్ విధానాలకు తాను అతీతుడనే ప్రమాదకరమైన భ్రమల్లోకి బాబు వెళ్ళిపోయారా..?