అవ‌న్ని ఉత్తిత్తివే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy
Updated:  2018-11-05 10:39:13

అవ‌న్ని ఉత్తిత్తివే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఈ మేర‌కు ఆయ‌న వ‌రుస ట్వీట్లు కూడా చేశారు. 
 
చంద్ర‌బాబు నాయుడు గారూ...
 
మా పార్టీని మీరు కోడి కత్తి పార్టీ అంటూ దిగజారి శునకానందం పొందుతున్నారు. కాబట్టి, ఇక మీదట మీ పార్టీని మేం శునకానందం పార్టీగా పిలుస్తాం. మిమ్మల్ని శునకానంద నాయుడుగా పిలుస్తాం. సరేనా అంటే విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.
 
మ‌రో ట్వీట్ చేస్తూ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)లు,కమిషన్‌లు చంద్రబాబు చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చే వ్యవస్థలన్నది బహిరంగ రస్యం.అవి బాబు ‘సిట్‌’అంటే కూర్చుని,‘స్టాండ్‌’అంటే నిలబడి తమ వీరవిధేయతను ప్రకటిస్తాయి. సీఎంగా 14ఏళ్ళ హయాంలో బాబు వేసిన సిట్‌లు, విచారణలు ఉత్తిత్తివే అన్నది చారిత్రక సత్యం.
 
కులం మ‌తం పేర్ల‌తో ఓట్లు అడిగే హక్కు ఎవ‌రికి లేద‌ని  మీర గొప్ప నిజాన్ని క‌నుక్కున్నారు.మీకు రాజ్యంగంమీద ఉన్న‌ట్టుండి ప్రేమ పుట్టుకు వ‌చ్చింద‌ని ఎవ‌రూ అనుకోవ‌టంలేదుగాని మీరు జీవితంలో ఏ మ‌తానికి అయినా ఏ కులానికి అయినా మంచి చేస్తే క‌దా భ‌స్మాసురిడిలా అంద‌ని నెత్తిన చెయిపెట్టి విశ్వ‌మాన‌వుడిలా ఈ ఫోజులేమిటి చంద్ర‌బాబు అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

షేర్ :