ఏమిటిది చంద్ర‌బాబు అంటూ విజ‌య‌సాయి ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-05 17:16:40

ఏమిటిది చంద్ర‌బాబు అంటూ విజ‌య‌సాయి ట్వీట్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రినీ ఒక సారిమోసం చేయ‌వ‌చ్చుగానీ.... ప్ర‌తీసారీ మోసం చెయ్య‌లేర‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ఏప్ప‌టికి అయినా చంద్ర‌బాబు అరాచ‌ర‌కాల‌ను ప్ర‌జ‌లు తెల‌సుకుంటార‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంటే అన్ని వ‌ర్గాల వ్య‌తిరేకి అని ఆయ‌న మండిప‌డ్డారు.
 
అంతేకాదు ఒక వీడియోని కూడా ట్వీట్ చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంటే విద్రోహి అని అంతులేని అవినీతిప‌రుడ‌ని, అస‌మ‌ర్ధుడ‌ని, అప‌ద్ద‌పు హామీల‌కు చిరునామాఅని, యూట‌ర్న్ తీసుకోవ‌డంతో మాస్ట‌ర్ అని, రైతు వ్య‌తిరేకి అని, మైనార్టీ వ్య‌తిరేకి అని నిరుపేద‌ల బ‌ద్ద వ్య‌తిరేకిఅని పేర్కొన్నారు.
 
మ‌రో ట్వీట్ చేస్తూ..
 
టీడీపీ ప్ర‌భుత్వంలో  APSAC లోని ఉన్నత అధికారులు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. రోగులను బ‌య‌ట నుండి మెడిష‌న్స్ ను కొనుగోలు చేసుకోవాల‌ని చెబుతున్నార‌ని విజ‌య‌సాయినెడ్డి మండిప‌డ్డారు. అంతేకాదు కొత్త‌గా జ‌న్మించిన శిశుల‌కు కూడా ఈ బాధ త‌ప్పట్లేద‌ని ఆయ‌న ఆవేద‌న చెందారు. 
 
ప‌లు వ్యాదుల నుంచి చిన్నారుల‌ను కాపాడే nevirapine సిర‌ప్ కూడా ఇవ్వ‌కున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రం ప్ర‌జారోగ్యం యంత్రాంగం  అథ‌య‌స్థాయికి దిగిపోయింద‌ని  విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు. అలాగే  హెచ్ఐవీ రోగుల‌కు , చిన్న పిల్ల‌ల‌కు మందులు ఎక్క‌డ‌ని ప్ర‌శ్నించారు. ఏమిటిది చంద్ర‌బాబు అని ట్వీట్ చేశారు ఆయ‌న‌.
 
మ‌రో ట్వీట్ చేస్తూ..
 
రాష్ట్రంలో చెరుకు సాగు 1.75 లోల హెక్టార్ నుంచి 90,000 వేల హెక్టార్ల‌కు ప‌డిపోవ‌డం వ‌ల్లే చెరుకు రైతులంతా  చాలా సంక్షోభంలో ఉన్నార‌ని అన్నారు. సాగు వ్య‌యాన్ని నియంత్రించ‌డంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం, ధ‌ర‌ల్లో ఒడుదుడుకుల కార‌ణంగా వారికి త‌క్కువ ప్ర‌తిఫ‌లం ల‌భిస్తోంది. అయినా వారికి ఆదుకోవ‌డానికి చంద్ర‌బాబు  ప్ర‌భుత్వాం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని విజ‌య‌సాయి రెడ్డి ట్వాట్ చేశారు.
 
You can fool some people all the time. You can also fool all the people for some time. But you can't fool all the people all the time. Truth finds it path to people.
 
Top officials in APSAC directly under the TDP government are facing serious allegations of corruption. Patients are shamelessly asked to buy drugs from the outside. Even newborns are not spared as their nevirapine syrup is denied which protects them from various diseases.
 
The sugarcane farmers are depressed because area under cultivation has declined a rapid pace (from 1.75 lakh hectares to just 90000 hectares). They get very low returns following the price fluctuations & TDP govt’s inability controlling hikes in prices of cultivation.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.