ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-07 06:03:12

ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు

చెప్పిన మాట ప్రకారం వైఎస్సార్సీపీ ఎంపీ లు రాజీనామా చేశారు. రాజీనామాలు స్పీకర్ ఆమోదించారు..మాటతప్పే అలవాటు లేదు, మడమతిప్పే అలవాటు లేని నాయకుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... అందుచేతనే గత 2 సంవత్సరాల ముందు చెప్పినట్లుగా ప్రత్యేకహోదా సాధనకొరకు ఆఖరి అస్త్రంగా మా వైస్సార్సీపీ ఎంపీల చేత రాజీనామాలు చేపిస్తాం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు...
 
స్పీకర్ కి ఇష్టం లేకపోయినా కానీ ప్రత్యేకహోదా 5 కోట్లు ఆంధ్రుల హక్కు వారి భవిష్యత్తు కోసం మా పదవులు తృణప్రాయంగా పెడతామని ప్రత్యేకహోదా సాధించేవరకు మా పోరాటం ఆగదు అని చెప్పి పదవులను సైతం తృణప్రాయంగా పెట్టిన ఎంపీలు 5 గురికి  ధన్యవాదాలు తెలుపుతూ.. మీ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ప్రాణ త్యాగానికి కూడా సిద్దపడి ఆమర‌ణ నిరాహారదీక్ష చేసిన మీకు యావత్ ఆంధ్ర రాష్ట్రం రుణపడి ఉంటుంది. 
 
మే 23 న శ్రీనివాస్ రావు నూజివీడు తహసీల్దారు ఆఫీస్ ముందు ఆత్మ హత్య చేసుకున్నారు.. మీరంతా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారని వైస్సార్సీపీ రాష్ట్రమహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం లో పని చెయ్యడం చాల గొప్పగా భావిస్తున్నాం అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు .
 
చంద్రబాబు మరియు అయన తెలుగు తమ్ముళ్లు వైస్సార్సీపీ ఎంపీల రాజీనామాలపై మాట్లాడే విధానం చూస్తుంటే వారికి ప్రత్యేక హోదా పైన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పైన ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఆమె ఎద్దేవా చేశారు. మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే నవనిర్మాణ దీక్షలతో ప్రజా సొమ్మును అనవసరంగా కోట్లకు కోట్లు దుర్వినియోగం చేయకుండా తక్షణమే మీరు టీడ‌పీ ఎంపీల చేత రాజీనామాలు చేయించి మీ నిజాయితీని నిరూపించుకోవాలి అని ఆమె డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.