ఆడకూతురికి న్యాయం చేయలేని చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 14:32:05

ఆడకూతురికి న్యాయం చేయలేని చంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు చేస్తునే ఉన్నారు.... ఒక ఆడకూతురికి న్యాయం చేయలేని ముఖ్య‌మంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత అంటు, ఆయ‌న‌ తక్షణమే రాజీనామా చేయాలి అని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి డిమాండ్ చేసారు 
 
దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరగడం దారుణం అని ఏపీలో గత కొంతకాలం నుంచి అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు... ఇలాంటి సంఘటనల్లో దోషులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారని  శైలజ తెలిపారు...  అయితే వారిపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఇటువంటి ఘటనలు మళ్ళి మళ్ళి జరుగుతున్నాయని అని ఆమె అన్నారు... శాంతి భద్రతలు అంటే `శాంతి'  అనే అమ్మాయి ఎవరు అని అడిగే రీతిలో టీడీపీ నాయకులు ఉన్నారు అని ఆమె మండిప‌డ్డారు. 
 
ఒక్క గుంటూరు జిల్లాలోనే వరుసగా 5 గురు అమ్మాయిలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆడవాళ్లపై 40 రోజుల్లోనే 45 అత్యాచార, వేధింపుల సంఘటనలు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంది... అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నార‌ని అన్నారు...
 
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని  విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌  దందా నడిపేవారికి  టీడీపీ పెద్ద నాయకులు  అండదండలు ఇస్తే చంద్రబాబు మద్దతు తెలిపారని శైల‌జ మండిప‌డ్డారు... అందుకే ఇప్పుడు రాష్ట్రంలో మగాళ్లు మృగాళ్లుగా మారి పసిపిల్లలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు... ఘ‌ట‌న జ‌రిగిన రోజే టీడీపీ నాయకులపై చర్యలు తీసుకుని ఉండే ఈ రోజు రేప్‌ సంఘటనలు జరిగేవి కావు అని ఆమె అన్నారు.
 
ఎక్కడో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనపై ఉపన్యాసాలు ఇచ్చే  చంద్రబాబు నాయుడు  ఈ వరుస అత్యాచారాలపై ఏం సమాధానం చెప్తారు. తక్షణమే దాచేపల్లి లో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేయాలి...లేదంటే బాలిక తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామ అని ఆమె డిమాండ్ చేశారు.పోయిన ఏడాది గుంటూరు జిల్లా లో నమోదైన కేసు లు : 5198 (గుంటూరు అర్బన్, గుంటూరు) ఈ ఏడాది మే 3 వరకు గుంటూరు జిల్లా లో నమోదైన కేసు లు 8668 (గుంటూరు అర్బన్, గుంటూరు) 
 
-నిన్న దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరం లో 8 ఏళ్ళ మైనారిటీ బాలిక పై 50 ఏళ్ల  మానవ మృగం అత్యాచారం చేస్తే సెటిల్మెంట్ చేసేదానికి  కోందరు నాయకులు  దిగటం  సిగ్గుచేటని ఆమె అన్నారు.. 
 
-15రోజుల క్రితం పక్కన రెంటచింతల మండలం లో ఇలాంటి సంఘటన జరిగితే ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం చాలా భాదాకరం ఆమె అన్నారు.
 
దాచేపల్లి ఘటన మనసును కలిసి వేసిందన్నారు... కథువా నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఇలాంటి ఘటనలను విన్నప్పుడల్లా తీవ్ర వేదనకు గురువుతున్నట్టు ఆమె  పేర్కొన్నారు... అత్యాచారాలకు పాల్పడేవారు భయపడే పరిస్థితి రావాలంటే.. నిందితులను బహిరంగంగా శిక్షించే విధానం రావాలని  ఆమె డిమాండ్ చేశారు. ఆయన వచ్చాడు....అన్నపూర్ణ అస్తమించింది...అని ఆవేదన వ్యక్తం చేసారు శైలజ చరణ్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.