అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-20 10:41:45

అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?

కర్ణాటక ఎన్నికల పట్ల చంద్రబాబు భారతీయ జనతా పార్టీ పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి  శైలజ చరణ్ రెడ్డి  మాట్లాడుతూ...100 కోట్లకు కూడా లొంగని కర్ణాటక ఎమ్మెల్యేలు నీతి నిజాయితీ గలవారు అని, టీడీపీకి అమ్ముడుపోయిన ఆంధ్ర ఎమ్మెల్యేలు పెద్ద మోసగాళ్లు అని, చీడ పురుగులు అని ఆమె అభిప్రాయపడ్డారు...
 
అవసరం లేక పోయినా వైసిపి ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపి తన పార్టీలోకి లాక్కున్నప్పుడు, సంతలొ పశువులలా 23 మంది ఎమ్మెల్యేలను కొని అందులొ నలుగురిని మంత్రులను చేసినప్పుడు ప్రజాస్వామ్య విరుద్దమని తెలియదా అని ఆమే  ప్రశ్నించారు. ఇక పొతే ఇక్కడ ఏపీలో ఎన్నికల ఫలితం వచ్చిన రెండవ రోజే బాబుకు పూర్తి మెజారిటీ ఉన్నా నంద్యాల వైసీపీ ఎంపీ SPY రెడ్డిని టీడీపీలోకిపిరాయించేలా చేసారు బాబు, నెలలోపే అరకు వైసీపీ ఎంపీ కొత్తపల్లి గీతను టీడీపీలోకి పిరాయించేలా చేసారు.. బాబు చేసిన రాజ్యాంగేతర చర్యల గురించి శైలజ చరణ్ రెడ్డి గుర్తు చేసారు...
 
1999 లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన మోత్కుపల్లి  నర్సింహులును రాజీనామా చేయించకుండా టీడీపీలోకి తీసుకున్నారు అప్పటి సీఎం బాబు. తరువాత 2004 లో రాజశేఖర్ రెడ్డి ఎం అయ్యాక TDP టికెట్ మీద గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి వస్తానంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లారు దివగంత నేత రాజశేఖర్అ రెడ్డి అని ఆమె సూచించారు...
 
నంద్యాల బై ఎలెక్షన్సుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిచే టీడీపీకి రాజీనామా చేపించి, వైసీపీలోకి తీసుకున్న ఘనత జగన్ కే దక్కుతుందని ఆ విధంగా తండ్రీ కొడుకులు ఉన్నత విలువలు పాటించారు ఆమె అన్నారు. 
 
రాజకీయ జీవితం ఇచ్చిన సొంత మామపై చెప్పులు వేయించినప్పుడు, నిండు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఅర్ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అన్నారు. ముందు తన పార్టీలోకి లాక్కున్న వైసిపి ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఆ తరువాత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు శైలజ చరణ్ రెడ్డి...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.