ఆరోగ్యానికి సారా ఎంత హానికరమో... ఆంధ్ర రాష్ట్రానికి నారావారు అంతే ప్రమాదకరం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-09 15:29:56

ఆరోగ్యానికి సారా ఎంత హానికరమో... ఆంధ్ర రాష్ట్రానికి నారావారు అంతే ప్రమాదకరం

నారా చంద్రబాబు పరిపాలనలో అన్ని మోసాలు, అబద్ధాలు, అవినీతి, అన్యాయాలే.. ఆరోగ్యానికి "సారా" ఎంత హానికరమో..  ఆంధ్ర రాష్ట్రానికి "నారావారు" అంతే ప్రమాదకరంగా మారారు అని వైస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి  శైలజ చరణ్ రెడ్డి అన్నారు 
 
ప్రత్యేకహోదా ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం మహోద్యమమే జరుగుతోంది.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చి ఇప్ప‌టికీ నాలుగేళ్లు పూర్తి అవుతున్నా ఏపీకి ప్ర‌త్యేక హోదా రాలేదు. చంద్ర‌బాబు పూట‌కో మాట మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నారు. కేంద్రం ప్ర‌త్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటే అర్ధ‌రాత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించిన చంద్ర‌బాబు కేంద్రాన్ని పొగ‌డ్త‌ల‌తో ముంచారు.
 
హోదా ఉద్య‌మాన్ని వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ తీవ్రత‌రం చేయ‌డంతో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకున్నారు. అయితే ఆయ‌నలో చిత్త‌శుద్ధి క‌నిపించ‌డం లేదు. వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం అంటే ఏం ప్ర‌యోజ‌న‌మ‌న్న చంద్ర‌బాబు మ‌రుస‌టి రోజే కేంద్రంపై అవిశ్వాస తీర్మాన‌మ‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమ‌ర‌ణ దీక్ష చేస్తే హేళ‌న చేసిన చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజున 30 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి దొంగ దీక్ష చేశారు. ఇప్పుడు నవనిర్మాణదీక్షలతో నయవంచన చేస్తున్నాడు అని ఆమె వివరించారు 
 
ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై మొట్ట మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీ వైయస్‌ఆర్‌ సీపీనే.. రాజీనామాలు చేసిన పార్టీ కూడా వైస్సార్సీపీ అని ఆమె గుర్తుచేశారు. చంద్రబాబు దీక్ష చూసినప్పుడు ఒక కథ గుర్తుకు వచ్చిందన్నారు అ కధను చెబుతూ...పాత కాలంలో ఒక సామంత రాజు ఉండేవాడట, అతనికి పిచ్చి అనే సంగతి తెలియక పాపం అతన్ని నమ్మి ఏదో చేస్తాడులే అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ప్రజలు. ఈ రాజుని పాలించే పైన ఉండే చక్రవర్తి ఓ రోజు ప్రజలకు ఉచితంగా బియ్యం సంచులు ఇస్తానని ప్రకటించాడు.ఇంకేముంది ఈ సామంత రాజు పొలోమని అందరికి అదే ప్రకటించాడు.
 
తీరా గడువు దగ్గరికి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి ఒక్కో బియ్యం సంచి వచ్చింది. కాని అందులో బియ్యం లేవు. ఖాళీవి... ఇదేంటి అని ప్రజలు సామంత రాజుని అడిగితే బియ్యం సంచులు ఇస్తాం అన్నామే కాని అందులో బియ్యం ఉంటుందని చెప్పలేదుగా అంటూ మాట మార్చేశాడు. మీరే అందులో బియ్యం నింపుకోండి అని చెప్పి ఎంచక్కా పోయి చక్రవర్తితో కలిసి అదే బియ్యంతో విందు చేసుకున్నాడు. 
 
ఇక్కడ రాజు నరేంద్ర మోడీ అయితే బుర్ర లేని సామంత రాజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి అచ్చంగా ఇలాగే ఉంది అని దుయ్యపట్టారు. 
 
ఆయన వచ్చాడు.. మహిళలకు రక్షణ లేదు..
మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది .విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ దందా నడిపేవారికి  టీడీపీ పెద్ద నాయకులు అండదండలు ఇస్తే చంద్రబాబు మద్దతు తెలిపారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో మగాళ్లు మృగాళ్లుగా మారి పసిపిల్లలపై దాడులు చేస్తున్నారు.  అందుకే ఆయన వచ్చాడు.. మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో జరిగేది ఏమిటంటే మోసాలు, అబద్ధాలు, అవినీతి, అన్యాయాలు. ఈ నాలుగు దాల మీద రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు మోసం చేయని వ్యక్తి ఎవరు ఉండరేమో అని శైలజ చరణ్ రెడ్డి అన్నారు 
 
ఇసుక దందా , ఫ్యాక్షన్ రాజకీయాలు ' లక్షల కోట్ల దోపిడీ , పట్టి సీమ అవినీతి , భోగాపురం భూములు , రాజధాని భూ కబ్జా ఇలా చెప్పుకుంటే పొతే ఇంకా ఎన్నో ఎనెన్నో ..అని ఆమె విమర్శించారు .చంద్రబాబు పాలనలో ప్రతిరోజు బ్లాక్ డే నే అని ఆమె మండిపడ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.